English | Telugu
పార్వతి పరమేశ్వరులుగా డాక్టర్ బాబు, వంటలక్క
Updated : Aug 20, 2022
స్మాల్ స్క్రీన్ పై కార్తీక దీపం క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంతా కాదు. డాక్టర్ బాబు, వంటలక్క వీళ్ళిద్దరూ ఈ సీరియల్ కి బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారు. ఇప్పుడు కార్తీక దీపం యాక్టర్స్ ని పెట్టి ఈవెంట్స్ చేయించాలని డిసైడ్ ఐనట్టుంది స్టార్ మా. అందుకే ఈ సారి వినాయక చవితి స్పెషల్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేయడానికి రెడీ అయ్యింది. ఈ ఈవెంట్‌లో డాక్టర్ బాబు శివుడిలా.. వంటలక్క పార్వతీ దేవిలా నటించింది. వినాయకుడి చరిత్రను ఆడియన్స్ కి చెప్పడానికి ఈ ఈవెంట్ నిర్వహించారు. మాతో పండగే పండగ టైటిల్ తో ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రోమో చూస్తేనే అదిరిపోయింది. గూస్ బంప్స్ వచ్చేసాయి. ప్రోగ్రాం కోసం వెయిటింగ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇందులో శివుడి గెటప్‌లో నిరుపమ్ పరిటాల అద్భుతంగా అనిపిస్తే.. పార్వతీ దేవిగా ప్రేమీ విశ్వనాథ్.. నిజంగా దివి నుండి భువికి ఆ దేవతే దిగి వచ్చిందా అన్నట్టుగా మెస్మరైజ్ చేసేసింది. మరి ఈ ఈవెంట్ ఎప్పుడు, ఎన్ని గంటలకు, ఈ గణనాథుడి చరితంతో పాటు ఇంకా ఏ ఏ కార్యక్రమాలున్నాయి, ఎవరెవరు పాల్గొనబోతోన్నారనే విషయాలను మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ఇటు వైపు ఈటీవీ కూడా వినాయకచవితి స్పెషల్ ఈవెంట్ తో రెడీ అయ్యింది. కానీ ఎన్ని స్పెషల్ ఈవెంట్స్ వచ్చినా డాక్టర్ బాబు, వంటలక్క ముందు ఏదీ నిలబడలేదు అనేది వాస్తవం.