English | Telugu
వాట్సాప్ అనేది ఒకటుందనే విషయం రాజమౌళి గారి ద్వారానే తెలిసింది
Updated : Aug 20, 2022
జబర్దస్త్ షో ద్వారా అదిరే అభి ఫుల్ ఫేమస్ అయ్యాడు. డిఫరెంట్ స్కిట్స్ తో బుల్లి తెర మీద మంచి పేరు తెచ్చుకున్నాడు. అలా అభి తన లైఫ్ లో జరిగిన ఎన్నో విషయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అయ్యాక కొన్ని మూవీస్ లో కూడా చేసాడు. అలాగే బాహుబలి 2 కి అసిసెంట్ డైరెక్టర్ గా కూడా పని చేసినట్టు చెప్పుకొచ్చాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంతో కష్టపడ్డానని అదొక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని అలాగే ఈ అవకాశం వల్లి మేడం ద్వారా వచ్చిందని చెప్పుకొచ్చాడు.
అలాగే ఒక పక్కన అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూనే, మరో వైపు జబర్దస్త్ కి టైం కేటాయించుకుంటూ సాఫ్ట్ వెర్ జాబ్ కూడా చేసినట్లు చెప్పాడు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు షూటింగ్, 6 నుంచి 11 వరకు సాఫ్ట్ వెర్ జాబ్, షూటింగ్ లేని టైంలో జబర్దస్త్ షూటింగ్, ఈ మధ్యలో రాజమౌళి టీమ్ తో ఒక గంట వాలీబాల్ ఆడేవాడినని చెప్పుకొచ్చాడు. ఒక రోజు రాజమౌళి గారికి ఒక వాయిస్ కావాల్సి వచ్చి తనకు ఫోన్ చేసినప్పుడు ఆ టైంలో గోవాకి వెళ్తున్నట్లు చెప్పడంతో ..ఒక వాయిస్ రికార్డు చేసి వాట్సాప్ లో పంపు అన్నారట.
వాట్సాప్ అంటే ఏమిటి అని అడిగేసరికి ఇది తెలీదా సరే నువ్ దిగాక వాయిస్ రికార్డు చేసి మెయిల్ చెయ్ అన్నారట. అలా 2012 లో వాట్సాప్ అనేది ఒకటి ఉందనే విషయం ఆయన ద్వారానే నాకు తెలిసింది అని చెప్పాడు అదిరే అభి. టెక్నాలజీ పరంగా రాజమౌళి చాలా ముందుంటారని చెప్పాడు.