English | Telugu
అంబటి అర్జున్ సిల్లీ నామినేషన్.. పల్లవి ప్రశాంత్ టార్గెట్!
Updated : Nov 13, 2023
బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి క్రేజ్ ని సొంతం చేసుకుంటుంది. గతవారం భోలే షావలి ఎలిమినేషన్ అవ్వగా హౌస్ లో పది మంది మిగిలారు. ఇక సోమవారం హీటెడ్ నామినేషన్లు మొదలయ్యాయి.
హౌస్ లో ఎవరు అన్ డిజర్వింగ్ అని మీరు భావిస్తున్నారో, తగిన కారణాలు చెప్పి నామినేషన్ ని చేయండంటూ కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ చెప్పాడు. ఒక గాజు సీసాని ఇచ్చి నామినేషన్ చేసిన వారి నెత్తిన పగులగొట్టాలని నిర్దేశించాడు బిగ్ బాస్. ఇక రతిక నామినేషన్ ప్రక్రియని మొదలుపెట్టింది. శోభాశెట్టి, ప్రియాంక జైన్ లని నామినేషన్ చేసింది రతిక. ఆ తర్వాత అంబటి అర్జున్ వచ్చి తన మొదటగా పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేశాడు. సిల్లీ రీజన్స్ చెప్తూ పల్లవి ప్రశాంత్ ని అంబటి అర్జున్ నామినేట్ చేశాడు. నువ్వు ఇండివిడ్యువల్ గేమ్ ఆడట్లేదు. శివాజీ అన్న సపోర్ట్ తీసుకొని ఆడుతున్నావంటూ అంబటి అర్జున్ అన్నాడు.
అయితే అంబటి అర్జున్ మాట్లాడేటప్పుడు కావాలనే పల్లవి ప్రశాంత్ ని రెచ్చగొట్టడానికి పదే పదే శివాజీ పేరుని మధ్యలో తీసుకొచ్చి పల్లవి ప్రశాంత్ ని మాట్లాడకుండా చేశాడు. అసలు దీనివెనుక ఉన్న కారణమేంటంటే.. మొన్నటి ఆదివారం నాటి ఎపిసోడ్ లో టాప్-5 కంటెస్టెంట్స్ ఎవరని స్టేజ్ మీదకి వచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ని నాగార్జున అడిగినప్పుడు.. దాదాపు అందరు పల్లవి ప్రశాంత్ పేరుని పెట్టారు. ఇక పల్లవి ప్రశాంత్ టాప్-5 లో ఉన్నాడని కనిపెట్టిన అంబటి అర్జున్ ఎలాగైనా పల్లవి ప్రశాంత్ ని రెచ్చగొట్టి ఏదో మాట అనేలా చేయాలని.. అసలు సంబంధం లేని కారణంతో నామినేట్ చేశాడు.
ఈ విషయం నామినేషన్ చూసిన ప్రతీ ఒక్క ప్రేక్షకుడికి తెలిసిపోయింది. అయితే ఇన్నిరోజులు హౌస్ లో ఫేక్ స్మైల్ తో యాక్ట్ చేస్తున్న అంబటి అర్జున్ కావలనే గౌతమ్ కృష్ణని రెచ్చగొడుతున్నాడు. శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్, స్ట్రాంగ్ అని భావించిన అంబటి అర్జున్.. హౌస్ మేట్స్ దృష్టిలో వీరిని నెగెటివ్ చేయాలని చూస్తున్నాడు. అందుకే అర్జున్ కి సరైన ఓటింగ్ కూడా లేదు.
రెండవ నామినేషన్ గా శోభా శెట్టిని చేశాడు అంబటి అర్జున్. కెప్టెన్ అయిన దగ్గర నుండి ఏదో వీఐపీ రూమ్ లో ఎంజాయ్ చేయడానికి వచ్చావ్ తప్ప నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించలేదని అంబటి అర్జున్ అనగా... నువ్వు చూసావా? అని శోభా అనగా.. ఈ తింగరి సమాధానలే వద్దు. తుకాలి ఆన్సర్లు చేయొద్దు. కిచెన్ లో సాయంత్రం తప్ప.. అసలు పొద్దున్నుండి ఒక్కసారి కూడా రాలేదు. అందరు లేచాకా హౌస్ మేట్స్ డ్యూటీ ఏంటని ఒక్క రోజైన అడిగావా? నీ బాధ్యత అంతేనా అంటూ శోభాశెట్టిని నామినేషన్ చేసాడు అంబటి అర్జున్.