English | Telugu
బట్టలు పొట్టిగా ఉన్నప్పుడు అలా ఎలా చేస్తారు ?
Updated : Jan 20, 2025
ఫ్యామిలీ స్టార్ ఈ వీక్ షోలో బులెట్ భాస్కర్ ప్రియాంక జైన్ తో సరిదిద్దుకోలేని తప్పు చేసేసాడు. వద్దన్నా వినకుండా తప్పు చేసాడు. ఆమెతో కలిసి డాన్స్ వేసాడు. ఐతే ప్రియాంక పొట్టి డ్రెస్ వేసుకొచ్చింది. కానీ డాన్స్ చేసేటప్పుడు తనను లిఫ్ట్ చేయొద్దు డ్రెస్ బాలేదు అని చెప్పింది. అదే విషయాన్నీ పవిత్ర కూడా చెప్పింది. కానీ బులెట్ భాస్కర్ వినీ విననట్టు బిల్డప్ ఇచ్చి ఆమె ఎత్తుకుని మరీ డాన్స్ చేసాడు. దాంతో ప్రియాంకకు మండిపోయింది. ఇద్దరి మధ్య గట్టిగా మాటల యుద్ధం జరిగిపోయింది. 'భాస్కర్ గారు మీకు రెస్పెక్ట్ ఇస్తాను. కానీ ఇలా చేస్తారని అనుకోలేదు' అంటూ సీరియస్ గా స్టేజి దిగి వెళ్ళిపోయింది. దాంతో దొరబాబు స్టేజి మీదకు వచ్చి "ఐనా చూసుకోవాలి ఆడోల్లతో డాన్స్ చేసేటప్పుడు" అన్నాడు.
తర్వాత స్రవంతి, పవిత్ర అందరూ బుజ్జగించి ఆమెను స్టేజి మీదకు తెచ్చారు. "ఇలా చేయడం కరెక్ట్ కాదు. మీ మాట విధానం బాలేదు. అలా మాట్లాడ్డం నాకు నచ్చలేదు".. అంటూ ప్రియాంక సీరియస్ గా అనేసరికి వెంటనే భాస్కర్ "ఎవరైనా ఇంట్లో స్క్రిప్ట్ రాసుకొచ్చి ఎత్తుకుంటారా , అమ్మా నీకో నమస్కారం, నీ పెర్ఫార్మెన్స్ కి ఒక నమస్కారం., సారీ, సారీ, సారీ" అని చెప్పాడు. " నేను ఇక ఇక్కడ ఉండకూడదు అనుకుంటున్నా..మీరు ఇలా సారీ చెప్పడం నచ్చలేదు. వాళ్ళు చెప్పమంటే సారీ చెప్పడం ఏంటి మనసులోంచి రావాలి కానీ" అంటూ ప్రియాంక సతాయించేసింది. "ఏంటయ్యా సారీని యాక్సెప్ట్ చెయ్యట్లేదు వీళ్ళు. మీ కాళ్ళు పట్టుకుని చెప్పాలా..ఇందాక ఎత్తినట్టు ఎత్తి చెప్పాలా సారీ" అన్నాడు సీరియస్ గా. వెంటనే పవిత్ర వచ్చి "నేను స్టార్టింగ్ చూస్తున్న నీ కళ్లన్నీ ప్రియాంక మీదనే ఉన్నాయి" అంది. వెంటనే ప్రియాంక "నాకు సారీ వద్దు ..ఏమీ వద్దు. సుధీర్ గారు ఏంటండీ అక్కడ కూర్చుని షో చూస్తున్నారా.. ఇలాంటి ప్రాంక్స్ మీరే చేయొచ్చు అనుకుంటున్నారేమో మేము కూడా చేయొచ్చు కూడా అప్పుడప్పుడు..అసలే నా ఫస్ట్ ఎపిసోడ్ " అంది. "నీకు ఫస్ట్ ఎపిసోడ్ కానీ జనాలకు కోపం వస్తే నాకు లాస్ట్ ఎపిసోడ్ చేస్తారు " అంటూ భాస్కర్ భయం నటించాడు. ఫైనల్ గా అది ప్రాంక్ అని తెలిసేసరికి అందరూ హ్యాపీ అయ్యారు.