English | Telugu

Bigg Boss 9 Telugu : సంజనని కత్తితో పొడిచిన ప్రియా.. కళ్యాణ్ చెత్త నామినేషన్!

బిగ్ బాస్ సీజన్-9 లో భాగంగా హౌస్ లో ఇప్పుడు రణరంగం కాదు చదరంగం అన్నట్టు గానే సాగుతుంది. ఏడో వారం రమ్య మోక్ష ఎలిమినేట్ అవ్వగా.. ఎనిమిదో వారం నామినేషన్ల కోసం ఆడియన్స్ ఫుల్ గా వెయిట్ చేశారు. ఇక సోమవారం రానే వచ్చింది. ఈసారి నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. ఇప్పటివరకు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రెజెంట్ ఉన్న కంటెస్టెంట్స్ ని నామినేట్ చేశారు.

మొదటగా హౌస్ లోకి మూడవ వారం ఎలిమినేట్ అయిన ప్రియా ఎంట్రీ ఇచ్చింది‌. తను లోపలికి రాగానే కళ్యాణ్ ఎదురుగా వెళ్లి ఎమోషనల్ అవుతాడు. థర్మకోల్ తో చేసిన ఓ బోర్డుని కంటెస్టెంట్స్ మెడలో ధరించగా, నామినేట్ చేసే కంటెస్టెంట్స్ వచ్చి ఆ బోర్డుపై కత్తితో పొడవాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇక మొదటగా సంజన ధరించిన ఆ బోర్డుపై కత్తితో పొడిచి నామినేషన్ చేసింది ప్రియా. మీరు హౌస్ లో కొన్ని వర్డ్స్ వాడుతారు. క్లాస్, స్టాండర్డ్ అంటూ వాడుతారు. అలా వాడడం కరెక్టేనా అని ప్రియా అడుగుతుంది. అంటే నేను ఏం మాట్లాడినా అది జోక్ గా ఫన్ వే లో పోతుందని ఆలోచిస్తానని సంజన అంటుంది. మీరు రోడ్డు రోలర్ లాగా మీదకి వస్తుందని దివ్యని అన్నారు.. ఇప్పుడు నిఖిల్ రాగానే కళ్యాణ్ ని వదిలేసిందన్నారు.. ఇలా ఒక అమ్మాయి క్యారెక్టర్ ని బ్యాడ్ చేస్తున్నారని ప్రియా తన మైండ్ లో పాయింట్స్ అన్ని క్లియర్ గా చెప్పింది. ఆ తర్వాత ఇంకొకరిని నామినేట్ చేసే ఛాన్స్ హౌస్ లో ఎవరికి ఇస్తావని బిగ్ బాస్ అడుగగా కళ్యాణ్ కి ఇస్తానని ప్రియా చెప్పింది.

కళ్యాణ్ తన నామినేషన్ గా రాముని చేస్తాడు. నువ్వు గతవారం టాస్క్ లో గివప్ ఇవ్వడం నాకు నచ్చలేదు. మా టీమ్ కి రమ్మని రిక్వెస్ట్ చేసాను కానీ నువ్వు రాలేదు.. జీరోతో ఉండి గేమ్ ఆడలేకపోయావని కళ్యాణ్ తన పాయింట్స్ చెప్పాడు. నువ్వు ఆడావు కదా.. నువ్వు కూడా కాలేదు కదా అని రాము అనగానే అలా పోక్ చెయ్యకని రాముతో కళ్యాణ్ అంటాడు. ఇలా ఈ ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. అయితే కళ్యాణ్ చెప్పిన నామినేషన్ నిజంగానే తుప్పాస్ అనిపించింది. ఎందుకంటే రాము గేమ్ అతడి ఇష్టం.. తన స్ట్రాటజీ ప్రకారం రాము ఆడాడు.. ‌అయితే కళ్యాణ్ చెప్పిన ఒక్క పాయింట్ కూడా వ్యాలిడ్ అనిపించలేదు. అందుకే కళ్యాణ్ ని ఇమ్మెచ్యూర్ అండ్ నిబ్బా అని అంటారేమో.. మరి కళ్యాణ్ నామినేషన్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.