English | Telugu
Bigg boss 9 Telugu : ముద్దుమాటలు చెప్పి ముద్దమందారం చెవిలో పెడుతున్నారు.. మర్యాద మనీష్ సూపర్ నామినేషన్!
Updated : Oct 28, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియ భిన్నంగా సాగింది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ మర్యాద మనీష్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన మొదటి నామినేషన్ గా కళ్యాణ్ ని చేస్తాడు. నువ్వు గేమ్ పై ఫోకస్ చెయ్యడం లేదు.. ముద్దు చేసి ముద్దమందారం చెవిలో పెడుతున్నారని తనూజని ఉదేశ్యించి కళ్యాణ్ తో మనీష్ చెప్తాడు. నువ్వు ఇమ్మాన్యుయల్ కి ఎందుకు వెన్నుపోటు పొడిచావ్.. నామినేషన్ ముందు తనూజని నామినేట్ చేస్తానని చెప్పి అక్కడికి వెళ్ళాక ఎందుకు ఒపీనియన్ మార్చుకున్నావని కళ్యాణ్ ని మనీష్ అడుగుతాడు.
నా నామినేషన్ తనూజ ఉండే కానీ నా పాయింట్స్ అన్నీ ఆల్రెడీ అయేషా చెప్పి తనూజని నామినేట్ చేసింది. అప్పుడు మళ్ళీ నేను చేస్తే కాపీ పేస్ట్ అవుతుందని అందుకే చెయ్యలేదని కళ్యాణ్ సమాధానం చెప్తాడు. ఆ తర్వాత రెండో నామినేషన్ కి మనీష్ తనకి ఇష్టమైన వారికి ఛాన్స్ ఇవ్వాలని బిగ్ బాస్ చెప్తాడు. దాంతో ఇమ్మాన్యుయల్ కి ఛాన్స్ ఇస్తాడు మనీష్. ఇక తనుజని ఇమ్మాన్యుయల్ నామినేట్ చేస్తాడు. మొన్న నేను తనుజని నామినేట్ చెయ్యాలి.. కానీ చిన్న పాయింట్ ఉందని చెప్పాను కదా అదేంటో ఇప్పుడు చెప్తానని ఇమ్మాన్యుయల్ అంటాడు. అయేషాకి పవర్ వచ్చింది కదా వీకెండ్ లో నాగ్ సర్ ఆ పవర్ కి అయేషా అర్హురాలు అవునా కదా అని అడిగినప్పుడు నాతో అర్హురాలు కాదని అన్నావ్.. మళ్ళీ పైకి లేచి అర్హురాలు అన్నావ్.. దాంతో నా మైండ్ పని చెయ్యలేదు.
ఆ తర్వాత మనం టెనెంట్స్ గా ఉన్నప్పుడు ఎవరో ఒకరికి మాత్రం ఓనర్ అయ్యే ఛాన్స్ అన్నప్పుడు నాతో ఒకమాట అన్నావ్.. మళ్ళీ అందరి ముందు ఒకలా మాట్లాడావు.. అది నీ స్ట్రాటజీ నో లేక గేమో అర్ధం కావడం లేదని ఇమ్మాన్యుయల్ అనగానే తనుజకి తనకి గొడవ జరుగుతుంది. మొత్తానికి ఇమ్మాన్యుయల్ గత రెండు వారాలుగా నామినేట్ చేస్తానన్నది ఈ వారం చేసాడన్నమాట.