English | Telugu

పృథ్వీ లఫూట్ గేమ్ స్టార్ట్ చేశాడు.. వార్నింగ్గా బొక్కా!

బిగ్ బాస్ హౌస్ లో సీజన్-5 లోని టాస్క్ ని తీసుకొచ్చాడు బిగ్ బాస్ అదే ప్రభావతి గేమ్. ఈ సారి ప్రభావతి (కోడి) 2.0 గా కాస్త బొద్దుగా ఎంట్రీ ఇచ్చింది. నేను అప్పుడప్పుడు గుడ్లను పంపిస్తాను. వాటిని జాగ్రత్తగా కాపాడాలి.. ఏ టీమ్ అయితే ఎక్కువ గుడ్లు తిరిగి ఇస్తారో వాళ్లకి కొన్ని ప్రయోజనాలు లభిస్తాయంటూ ప్రభావతి చెప్పింది. దీంతో బుట్టలు పట్టుకొని కంటెస్టెంట్స్ రెడీ అయిపోయారు. ఈ టాస్కు మొదలుకాగానే పృథ్వీ అయితే రెచ్చిపోయాడు. ఆడ మగా తేడా లేకుండా ఒక్కొక్కరిని విసిరి పారేశాడు. దీంతో పృథ్వీని ఆపడానికి నబీల్, అభయ్, ఆదిత్య ముగ్గురూ ట్రై చేశారు. ఇక మధ్యమధ్యలో యష్మీ కూడా ట్రై చేసింది. దీంతో మరింత రెచ్చిపోయిన పృథ్వీ.. ఆదిత్య మెడ పట్టుకొని ఓ పక్కకి విసిరేశాడు. దీంతో మీరు నా నెక్ ప్రెస్ చేసి తిప్పేశారు.. ఇది కరెక్ట్ కాదంటూ ఆదిత్య కాసేపు అరిచాడు. అయిన సరే పృథ్వీ వెనక్కి తగ్గలేదు. ఇక పృథ్వీని సోనియా కమాన్ కమాన్ అంటు రెచ్చగొట్టింది.

ఇక గేమ్ మధ్యలో బ్రేక్ రావడంతో తన టీమ్ మెంబర్స్‌తో పృథ్వీ గురించి అభయ్ చెప్పాడు. పృథ్వీ గాడు స్టార్ట్ చేశాడు లఫూట్ గేమ్.. వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పనికిమాలిన గేమ్ స్టార్ట్ చేసింది వాడే.. వాడు ఎవడిదైనా పానం పోయినా ఆగడు.. ఒన్ ఆఫ్ ది వరస్ట్ ప్లేయర్ ఇన్ బిగ్‌బాస్ హౌస్.. కామన్ సెన్స్, బ్రెయిన్ వాడని ఒకే ఒక ప్లేయర్ వాడే అంటు అభయ్ ఫైర్ అయ్యాడు.

మళ్లీ గేమ్ మొదలవ్వగానే అభయ్ టీమ్ దాచుకున్న గుడ్లను లాగేందుకు ట్రై చేశాడు పృథ్వీ. దీంతో ఇది చాలా తప్పు అంటూ ఆదిత్య మీదకి వెళ్లాడు. వెంటనే వాడు వీడు అంటూ బూతులు అందుకున్నాడు పృథ్వీ. వార్నింగ్ ఇస్తున్నా అలా అనొద్దు అంటూ ఆదిత్య అంటే.. వార్నింగా నా బొక్కా అంటూ ఎఫ్ వర్డ్ బూతు వాడాడు పృథ్వీ. గతవారమే నాగార్జున ఈ విషయంలో పృథ్వీకి వార్నింగ్ ఇచ్చాడు కానీ ఈసారి రెడ్ కార్డు ఇస్తాడో లేదో చూడాలి మరి. ఇక టాస్క్ మధ్యలో మణికంఠకి తీవ్ర గాయమైన కారణంగా అతడిని మెడికల్ రూమ్ కి పిలిచి గేమ్ ని పాస్ చేశాడు బిగ్ బాస్. ఆ తర్వాత అభయ్ వెళ్లి.. ఇది గేమ్.. ఇందులో అందరు ఇలానే ఆడతారు.‌. గేమ్ కంటే నీ లైఫ్ ఇంపార్టెంట్ అని మణికంఠతో అభి చెప్పగా.. నాకు విన్ అవ్వడం ఇంపార్టెంట్ అంటు ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ టాస్క్ మొదలైంది. ఇక బిగ్ బాస్ రెండు పెద్ద గంపలు పంపించాడు. వాటిలో రెండు టీమ్ ల మధ్య ఎన్ని గుడ్లు ఉన్నాయో వేసి, లెక్క చెప్పమని చెప్పాడు బిగ్ బాస్. శక్తి టీమ్ దగ్గర 66 గుడ్లు ఉండగా కాంతార టీమ్ 34 గుడ్లు ఉన్నాయి. దాంతో కాంతారా టీమ్ నుండి ఒకరిని తప్పించాలని శక్తి టీమ్ ని బిగ్ బాస్ కోరాడు. దాంతో నబీల్ ని శక్తి టీమ్ చెప్పడంతో.. అతడిని గేమ్ నుండి తీసేసి సంఛాలక్ గా పెట్టేశాడు బిగ్ బాస్. మరి ఈ రోజు టాస్క్ లో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.