English | Telugu

జైల్లో ఫుడ్ వేస్తారు కదా అలా విసిరింది.. ఏడ్చేసిన విష్ణుప్రియ!

బిగ్‌బాస్ హౌస్ లో ముందుగా నిన్న జరిగిన బెలూన్ టాస్కు గురించి రచ్చరచ్చ అయింది. సంచాలక్‌గా సోనియా డెసిషన రాంగ్ అంటూ యష్మీ గొడవకు దిగింది. నిఖిల్-అభయ్ ఏదో మాట్లాడుకుంటూ ఉంటే పెద్దపెద్దగా అరిచింది. దీంతో నిఖిల్‌కి బీపీ పెరిగి పక్కకెళ్లి అరువు అంటూ యష్మీపై ఫైర్ అయ్యాడు. దీంతో నువ్వెవడు నాకు చెప్పడానికి అంటూ యష్మీ కూడా రివర్స్ అయింది. ఇలా మొత్తానికి సోనియాను కార్నర్ చేస్తూ యష్మీ అయితే గట్టిగానే తగులుకుంది.

సంచాలక్ అంటే మహారాణిలా నిల్చోవాలా అన్నీ చూసుకోవాలి కదా అంటూ సోనియా గురించి ప్రేరణతో చెబుతూ యష్మీ ఫైర్ అయింది. ఇక సోనియా తీసుకున్న డెసిషన్ నచ్చలేదంటూ అభయ్ తమ టీమ్‌ అందరికి చెప్పాడు. ఇక నుంచి ఏ టీమ్ పని వాళ్ల టీమ్ వాళ్లే చేసుకోవాలని.. వాళ్ల పనులు ఏమీ మనం చేయక్కర్లేదని.. ఇందుకు బిగ్‌బాస్ తనని బయటికి పంపేసిన ఫర్లేదంటూ అభయ్ గట్టిగానే మాట్లాడాడు.

దోస చేసిన పెంట అంటే ఇదేనేమో.. ప్రేరణ, మణికంఠ దోసలు వేస్తుండగా.. అక్కడికి విష్ణుప్రియ వచ్చి ఒక దోస కావాలని అంది. దాంతో ప్రేరణ చిరాకుగా ఫేస్ పెట్టి ముష్టివాళ్ళకి విసిరేసినట్టు విష్ణుప్రియ ప్లేట్ లో పడేసింది. అది చూసి విష్ణుప్రియ డీప్ గా హర్ట్ అయ్యింది. ఒంటరిగా కూర్చొని ఏడుస్తుండటంతో విష్ణు ఏమైందంటూ తన టీమ్ మొత్తం వచ్చారు. ప్రేరణ ఫుడ్ విషయంలో.. తను దోస వేసి ఇచ్చిన విధానం హర్ట్ అయింది.. జైల్లో ఫుడ్ వేస్తారు కదా అలా విసిరింది ప్లేట్‌లో.. ఎవరిదైనా ఆకలే కదా అంటూ విష్ణుప్రియ ఏడ్చింది. ఇంతలో మణికంఠ అక్కడికి వచ్చి అవును అంటూ ప్రేరణ ఏం చేసిందో సాక్ష్యం చెప్పాడు. అంతేకాకుండా విష్ణును అక్కడికి తీసుకెళ్లి అందరి ముందు డిస్కషన్ పెట్టాడు. దీంతో ప్రేరణ ఫైర్ అయ్యింది. నువ్వు మాట్లాడకు, పో ఇక్కడి నుంచి అంటూ మణికంఠ మీద కోప్పడింది. దీంతో ఏం మాట్లాడొద్దు.. నా కళ్ల ముందే రాంగ్ జరిగింది ఇక్కడ.. నీకు అసలు పెట్టే బుద్ధే లేదు.. అందుకే నీకు కోపం వచ్చింది.. ఇలా వేశావంటూ మణికంఠ ఫైర్ అయ్యాడు. ఇలా విష్ణుప్రియ, ప్రేరణ, మణికంఠ మధ్య గొడవ ముదిరింది. వీరి ముగ్గురిలో ఎవరు కరెక్ట్ అని మీరనుకుంటున్నారో కామెంట్ చేయండి.


Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.