English | Telugu
శ్రీముఖి జాతిరత్నాలు షోకి పవర్ఫుల్ అమ్మాయి
Updated : Jun 16, 2022
జాతిరత్నాలు స్టాండప్ కామెడీ షో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తోంది. ఈ మధ్యకాలంలో స్టాండప్ కామెడీ షోకి చాలా ఛానెల్స్ మంచి వేదికలను అందిస్తున్నాయి. చిన్నవాళ్లు నుంచి పెద్ద వాళ్ళ వరకు వచ్చి రకరకాల కామెడీ లైన్స్ తో ఉన్న కాసేపు జోక్స్ వేసి నవ్విస్తున్నారు. అందులో పవిత్ర స్టాండప్ కామెడీ మంచి పంచెస్ తో దూసుకుపోతోంది. ఈ వారం జాతిరత్నాలు ఎపిసోడ్ లో పిసినారి టాపిక్ తీసుకుని అందులో వాళ్ళ అమ్మను మెయిన్ ఎలిమెంట్ గా ప్రెజంట్ చేస్తూ ఆడియన్స్ ని నవ్వించింది పవిత్ర. "ఈ షోకి వచ్చేముందు పది పంచులు వేసి పది మందిని నవ్విద్దాం అని అనుకున్నా. కానీ మా అమ్మ పిసినారితనం వల్ల నాలుగు పంచులు వేసి నలుగుర్ని నవ్వించి, మిగతా పంచులు ఇంకో టాపిక్ లో వాడుకో అని చెప్పిందట ..అంత పిసినారిది మా అమ్మ అంటూ మంచి కామెడీ లైన్ ని ఎంచుకుని ఫన్ క్రియేట్ చేసింది.
జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ తో ఇంటి స్థలం ఇస్తానమ్మా అని అంటే ఇచ్చేవాళ్లకే ఇంట్రెస్ట్ లేనప్పుడు మనమెందుకు అంత ఇంట్రెస్ట్ పెట్టి తీసుకోవాలి అందట. సమ్మర్ కదా మా కాలనీలో స్విమ్మింగ్ పూల్ కట్టించుకుందామని కాలనీలో పిల్లలందరం వెళ్లి చందాలు పోగుజేసి చివరికి మా ఇంటికి వచ్చి మా అమ్మని చందా ఇమ్మని అడిగాం. వెంటనే అమ్మ ఇంట్లోకి వెళ్లేసరికి చందా తేవడానికేమో అనుకున్నాం తీరా చూస్తే బకెట్ నీళ్లు తెచ్చింది. ఇదేంటమ్మా అని అడిగేసరికి స్విమ్మింగ్ పూల్ కి కావాల్సింది చందా కాదు నీళ్లు కదా అని పిసినారి మాటలు చెప్పిందండి"..ఇలా పవిత్ర అన్ని రకాలుగా మంచి కామెడీ స్కిట్ తో అలరించింది.