English | Telugu

వీర సింహాలు వర్సెస్ గర్జించే పులులు.. పల్లవి ప్రశాంత్ అవుట్!

బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఉత్కంఠభరితంగా మొదలవుతుంది. సోమవారం మంగళవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో యావర్, భోలే షావలి, అమర్ దీప్, టేస్టీ తేజ, శోభాశెట్టి, ప్రియాంక జైన్, అశ్వినిశ్రీ, అంబటి అర్జున్ ఇలా మొత్తంగా ఎనిమిది మంది నామినేషన్ లో ఉన్నారు. ఇక తొమ్మిదవ వారం టాస్క్ లని మొదలుపెట్టాడు బిగ్ బాస్.

అయితే టాస్క్ లు మొదలయ్యే మందు హౌస్ లోని కంటెస్టెంట్స్ మధ్య జరిగిన కొన్ని మాటలని బిగ్ బాస్ ప్రేక్షకులకి చూపించాడు. అశ్వినిని యావర్ అనవసరంగా నామినేట్ చేశాడంటు తన వాదనని పెంచుతుంటే, అది నా పాయింట్ అని యావర్ అన్నాడు. ఇక శోభాశెట్టి కూడా యావర్ అనవసరంగా పిచ్చోడు అని అన్నానంటూ చెప్పుకుంటూ బాధపడుతుంటుంది. శివాజీ ఒక్కొక్కరికి హౌస్ లో ఎలా ఉండాలో చెప్తున్నాడు. నామినేషన్ అనేది ఒక ప్రక్రియ.

మన ఫోకస్ గేమ్, టాస్క్ లు బాగా ఆడాలి. ఫెయిర్ గేమ్ ఆడాలి. జనాలు మన ఫెయర్ గేమ్ నే చూస్తారు. గొడవలు పెట్టుకుంటే మన గ్రాఫ్ కిందపడిపోతుందని యావర్, ప్రశాంత్ లతో శివాజీ చెప్పాడు. ఇక అశ్వినిశ్రీ తన మనసులోని విషయాలని సీరియల్ బ్యాచ్ ప్రియాంక, అమర్ దీప్ లతో పంచుకుంటుంది.

ఆ తర్వాత గార్డెన్ ఏరియాలో టాస్క్ మొదలైంది. ఇందులో హౌస్ మేట్స్ ని టైగర్స్ మరియు లయన్స్ అని రెండు టీమ్ లుగా విభజించిస్తాడు బిగ్ బాస్. ఒక పైప్ ఉంది. బజర్ మొదలవ్వగానే అందులో నుండి రకరకాల బాల్స్ పడుతుంటాయి. వాటిని కంటెస్టెంట్స్ కి ఇచ్చిన గోధుమ రంగు గల గోనెసంచిలో వేసుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇక శివాజీ తన ఒంటి చేత్తో సూపర్ ఫాస్ట్ గా గేమ్ ఆడుతున్నాడు. అయితే దీనికి ముందు బెలూన్స్ ఊది అక్కడి టైర్స్ లో పెట్టాలని చెప్పగా అందులో యావర్, టేస్టీ తేజ, శోభా శెట్టి ఉన్న లయన్స్ టీమ్ గెలిచింది.

ఆ తర్వాత బాల్స్ ఛాలెంజ్ లో గెలిచిన జట్టుకి కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం లభిస్తుందని, ఇందులో ఒక పవర్ బాక్స్ ఉంటుందని అది మీకు యూజ్ అవుతుందని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి చెప్పాడు. అయుతే ఈ గేమ్ లో గెలిచిన శోభా శెట్టి, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, యావర్, భోలే షావలి, రతిక అందరు కలిసి ఏకాభిప్రాయంతో అపోజిట్ టీమ్ లో ఉన్న పల్లవి ప్రశాంత్ ని కెప్టెన్సీ రేస్ నుండి తప్పించారు. ఆ తర్వాత డెడ్ బోర్డ్ ని బిగ్ బాస్ పంపించగా అది చూస్తూ పల్లవి ప్రశాంత్ ఏడ్చేశాడు. ఇక హౌస్ మేట్స్ అంతా ఓదార్చారు. ఆ తర్వాత శివాజీ వచ్చి డెడ్ బోర్డ్ ని ప్రశాంత్ మెడలో వేశాడు. పల్లవి ప్రశాంత్ ని గేమ్ నుండి తీసినందుకు భోలే షావలి ఎమోషనల్ అయ్యాడు.