English | Telugu
నా బాయ్ ఫ్రెండ్ నన్ను వదిలేస్తాడా!
Updated : Nov 2, 2023
బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది. నిన్న మొన్నటి దాకా హీటెడ్ నామినేషన్లు కొనసాగిన విషయం తెలిసిందే. అయితే నిన్నటి నుండి హౌస్ లో టాస్క్ లు మొదలయ్యాయి.
టాస్క్ ల కంటే శోభాశెట్టి, టేస్టీ తేజ మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హౌస్ లో ఒక్కో కంటెస్టెంట్ ఒక్కోలా ప్రవర్తిస్తుంటారని, ఒక్కొక్కరి స్ట్రాటజీ ఒక్కోలా ఉంటుందని అందరికి తెలిసిందే. అయితే ఇందులో శోభాశెట్టి చేసే అతి అంతా ఇంతా కాదు. ఆడ మగ అనే తేడా లేకుండా తోటి హౌస్ మేట్స్ తో అడ్డదిడ్డంగా మాట్లాడుతూ బిగ్ బాస్ సీజన్ 7 లోనే 'ది వరస్ట్ కంటెస్టెంట్' గా నిలిచింది శోభాశెట్టి. దీనికి తగ్గట్టు తేజాతో లవ్ ట్రాక్ ఒకటి.
కావాలని బలవంతంగా వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిపించాలని చూస్తున్నారు బిగ్ బాస్. ఇక తేజా అయితే.. ఆల్రెడీ శోభాశెట్టికి ఇండైరెక్ట్ గా ఐ లవ్యూ చెప్పేశాడు. ఏంటే.. ఒసేయ్.. అదే.. ఇదే.. అంటూ తేజా మాట్లాడే మాటలు చూస్తుంటే జనాలకి వీళ్ళేందో, వీళ్ళ అతి ఏందో అనిపిస్తుంది. నిజంగానే శోభాని పెళ్లాన్ని పిలిచినట్టే పిలుస్తున్నాడు తేజా. ఆడాళ్లని మహారాణులుగా చూసుకోవాలని బిగ్ బాస్ టాస్క్ ఇస్తే.. వీళ్లిద్దరూ జీవించేశారు. హౌస్‌లో ఉన్న ఆడాళ్లందర్నీ మహారాణుల్లా చూసుకోమని, వాళ్లకి బ్రేక్ ఫాస్ట్ తినిపించాలని బిగ్ బాస్ చెప్తే.. శోభా తనని ఎత్తుకొని తీసుకెళ్ళమని తేజకి చెప్తుంది. టాస్క్ కదా అని తేజ ఎత్తుకుని బాత్ రూంలోకి తీసుకుని వెళ్లి పళ్లు తోమించాడు. ఆ తర్వాత తెగ సేవలు చేసేశాడు. ఇది చూసిన ఎవరికైన ఏందిరా సామి మాకు ఈ కర్మ అని అనుకుంటారు.
శోభాశెట్టి గ్యాప్ దొరికితే చాలు తేజాతో హగ్ లు , క్లోజ్ గా కూర్చొని మాట్లాడుకోవడాలు చేస్తూనే.. నీతో ఇలా క్లోజ్ గా ఉండటం చూసి నా బాయ్ ఫ్రెండ్ ఏమైనా అనుకుంటాడా? అతనికి చాలా మెచురిటీ ఉంది. నన్ను అర్థం చేసుకుంటాడు. ఒకవేళ నన్ను అర్థం చేసుకోలేకపోతే నేను తీసుకోలేనురా తేజ అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది. అలాంటిదేమీ కాదులే నీలా నువ్వు ఉండు అంటు తేజ ధైర్యం చెప్పాడు. ఇక గతవారం ఎలిమినేషన్ జస్ట్ లో మిస్ అయిన శోభాశెట్టి.. ఈ వీక్ కూడా నామినేషన్ లో ఉండటంతో తనకి లోలోపల భయం మొదలైంది. అందుకే ఇలా ఏడిస్తే ప్రేక్షకులు కరిగి ఓట్లు వేస్తారనే సింపథీ డ్రామాని మొదలుపెట్టిందని నెటిజన్లు భావిస్తున్నారు.