English | Telugu

అనసూయ ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఆరో ఫోటో వైరల్!


అనసూయ భరద్వాజ్.. టెలివిజన్ రంగంలో యాంకర్ గా అడుగుపెట్టి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ..‌ రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత చాలా సినిమాలలో నటించిన అనసూయ.. తాజాగా రంగమార్తాండ సినిమాలో మంచి పాత్రని చేసానని మీడీయా ముందు ఎమోషనల్ అయింది. తన తర్వాతి సినిమా 'విమానం' మూవీ పోస్టర్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అప్పట్లో ట్రెండింగ్ క్రియేట్ చేసింది. తాజాగా మరో ఫోటోతో ట్రెండింగ్ లోకి వచ్చేసింది అనసూయ.

అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. వీకెండ్ పార్టీలని, హోమ్ టూర్ అని, సమ్మర్ వేకేషన్ అంటూ తన ప్రతీ అప్డేడ్ ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది. అయితే నిన్న మొన్నటిదాకా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో గొడవ పడుతూ పోస్ట్ లు చేసిన అనసూయ‌.. ఆ గొడవ సద్దుమణిగిందనేలోపే మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. జ్యువలరీ ప్రమోషన్స్, శారీ ప్రమోషన్స్ అంటూ బ్రాండ్స్ కోసం ప్రచారం చేస్తూ బిజీగా ఉంటున్న అనసూయ.

అనసూయ తాజాగా చీరకట్టులో అందాలు ఒలకబోసింది. ఇన్ స్టాగ్రామ్ లో ఓ పది ఫోటోలు కలిపి ఒక పోస్ట్ గా షేర్ చేసింది. ఇందులోని ఆరో ఫోటో ఇప్పుడు వైరల్ మారింది. భుజం పైకి లేపి చూపిస్తూ అప్లోడ్ చేసిన ఈ పోస్ట్ బోల్డ్ అండ్ హాట్ గా ఉంది. కాగా అనసూయ చీరకట్టులో కూడా అందాలు ఆరబోస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అందరు కామెంట్ సెక్షన్ లో.. ఆ ఆరవ ఫోటో గురించే నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఎప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో బోల్డ్ ఫోటోలతో ట్రెండింగ్ లో ఉండే అనసూయ మరోసారి వైరల్ గా మారింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.