English | Telugu
ఓటింగ్ లో పల్లవి ప్రశాంత్ నెంబర్ వన్.. చివరి స్థానాలలో ఆ ముగ్గురు!
Updated : Sep 14, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ ని ఎవరు అందుకోలేకోపోతున్నారు. అవును ఓటింగ్ లిస్ట్ ప్రకారం అత్యధిక ఓట్లతో మొదటి స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉండగా, పల్లవి ప్రశాంత్ కి పడే ఓట్లలో నాల్లో వంతు అమర్ దీప్ కి వస్తున్నాయి. మొన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో అమర్ దీప్ రైతులని కించపరిచేలా మాట్లాడడంతో అతను అందరికి నెగెటివ్ అయ్యాడు. ఇక ఇప్పుడు తన ఓటింగ్ గ్రాఫ్ అమాంతం పడిపోయింది.
కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ కి సింపతీ దక్కకూడదని అమర్ దీప్, రతిక, గౌతమ్ కృష్ణ, ప్రియాంక జైన్, ఆట సందీప్, శోభా శెట్టి అంతా కలిసి నామినేషన్ ముందు మాట్లాడుకొని కావాలని పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసి నామినేట్ చేశారు. అయితే తాజాగా వీళ్ళంతా కలిసి మాట్లాడుకున్నది వైరల్ గా మారింది. అయితే నిన్న, మొన్నటి దాకా పల్లవి ప్రశాంత్ కి ప్రేమ అని చెప్పి, లేనిపోని ఆశలు కల్పించి తీరా నామినేషన్ కి వచ్చా.. ఆరునెలలు కుక్కలెక్క తిరిగా అన్నావ్? ఇప్పుడు ఇక్కడికివచ్చి ఏం చేస్తున్నావను పల్లవి ప్రశాంత్ ని అనడంతో.. ఎంత మాట మార్చేశేవా రాధిక అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. రతికని 'డీజే టిల్లు' సినిమాలోని రాధిక పాత్రతో కంపేర్ చేస్తూ రతికని రాధిక రాధిక అని ట్యాగ్ చేస్తు పోస్ట్ లు చేస్తున్నారు.
శివాజీ మైండ్ గేమ్ ని హౌజ్ లోని కంటెస్టెంట్స్ ఎవరు పసిగట్టలేకపోతున్నారు. అందుకే ఓటింగ్ లో అతను రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే గత రెండు రోజుల టాస్క్ లో ప్రిన్స్ యావర్ బలంతో రణధీర టీమ్ గెలిచింది. దీంతో టాప్-4 లోకి ప్రిన్స్ యావర్ వచ్చాడు. అయితే అతనికి భాష ప్రాబ్లమ్ ఉండటంతో బిగ్ బాస్ పనిష్మెంట్ టాస్క్ కూడా ఇచ్చాడు. అయితే టేస్టి తేజ, శోభా శెట్టి, షకీల.. ఈ ముగ్గురు యాక్టివ్ గా లేరు.
దీంతో వీళ్ళు ఓటింగ్ లో చివరి మూడు స్థానాలలో కొనసాగుతున్నారు. దామిణి కన్నింగ్ మైండ్ గేమ్ ఆడుతుందని బిగ్ బాస్ ప్రేక్షకులకు తెలుస్తోంది. కాగా అమర్ దీప్ ఓటింగ్ లో చివరి నుండి నాల్గవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఎప్పుడైతే రైతులని కించపరిచేలా అమర్ దీప్ మాట్లాడాడో అతను హౌజ్ లో ఉండకూడదని, ఎలిమినేట్ చేయాలంటూ యువత ట్రెండింగ్ చేస్తున్నారు. కానీ కొంతమంది టీవీ యాక్టర్స్ అసలు అమర్ దీప్ ఏం మాట్లాడాడో కూడా తెలియకుండా సపోర్ట్ చేస్తున్నారు. అయితే అలా సపోర్ట్ చేస్తు పెట్టిన పోస్ట్ లకి నెటిజన్లు మాత్రం నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరో మూడు రోజుల్లో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ లిస్ట్ లో అమర్ దీప్, టేస్టీ తేజ, షకీల, శోభా శెట్టి ఉన్నారు. వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.