English | Telugu
అమ్రిష్ పురిగా ఆది..కన్నీళ్లు పెట్టుకున్న పూర్ణ
Updated : Sep 14, 2023
‘ఢీ ప్రీమియర్ లీగ్’ ప్రతి బుధవారం డాన్స్ లవర్స్ ని ఎంత అట్ట్రాక్ట్ చేస్తోంది. ఆ షో లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇందులో హైపర్ ఆది మాంత్రికుడి గెటప్ వేరే లెవెల్ లో ఉంది. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' మూవీలో అమ్రీష్ పురి తరహాలో కనిపించిన గెటప్ కి ఆడియన్స్ దిల్ ఖుష్ ఇపోయారు.
ఎర్ర పంచెలో అచ్చం గుండుతో, మెడలో పూసల దండలతో , కుడి చేతిలో నిమ్మకాయ, ఎడమచేతిలో మంత్ర దండం పట్టుకుని స్టేజి మీదకు నడుచుకుని వచ్చాడు. “నిన్ను సీసాలో బంధించి, మల్లెపూలలో మంత్రించి, నా వశం చేసుకుంటాను. కానీ ఏదో శక్తి నాకు అడ్డు పడుతుంది” అంటూ శేఖర్ మాస్టర్ వైపు ఆ మంత్రం దండాన్ని చూపించేసరికి శేఖర్ మాస్టర్ తో పాటు అందరూ నవ్వేశారు.
ఈ ప్రోమోలో డ్యాన్సర్లంతా పెర్ఫార్మెన్సులతో అదరగొట్టారు. కొత్త స్టెప్పులతో స్టేజి దద్దరిల్లింది. తీన్మార్ మ్యూజిక్ కి పూర్ణ, శేఖర్ మాస్టర్, యాంకర్ ప్రదీప్ సహా అందరూ కలిసి స్టేజి మీద వేసిన స్టెప్పులు వేసి అలరించారు. ఇక ఈ ప్రోమోలో తిండి లేకుండా ఇబ్బంది పడుతున్న ఒక కాన్సెప్ట్ తో ఒక పెర్ఫార్మెన్స్ అందరినీ కన్నీళ్లు పెట్టించింది. అలా తిండి లేక అవస్థలు పడుతున్న ఒక ముసలి వ్యక్తిని స్టేజి మీదకు తీసుకొచ్చారు. ఇక ఆ సంఘటన చూసిన జడ్జి పూర్ణ ఎమోషనల్ అయ్యింది. పిల్లలు తమ తల్లిదండ్రులను చూసుకోవాలని వాళ్ళను బయటకు వెళ్లగొట్టకూడదని చెప్పింది. ఎవరైనా అలా బయటకు పంపించేసి వాళ్ళు ఉంటె వెళ్లి వాళ్ళను వెనక్కి తీసుకొచ్చుకోవాలని సజెషన్ ఇచ్చింది. ఈ మాటలు చెప్తూ పూర్ణ కంటతడి పెట్టడం అందరినీ కలచివేసింది.