English | Telugu
రైతు కుటుంబానికి పల్లవి ప్రశాంత్ ఆర్థిక సాయం
Updated : Aug 2, 2024
పల్లవి ప్రశాంత్ ఒక పేద కుటుంబానికి సాయం అందించాడు. మెదక్‌లోని చిన శంకరపేట్‌కి చెందిన పరమేశ్వర్ అనే వ్యక్తి చనిపోయాడు. అతనికి భార్య శంకరమ్మ, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న భర్త చనిపోవడంతో శంకరమ్మ ముగ్గురు ఆడ పిల్లలను పెంచడం కష్టంగా మారింది. ఈ వార్త తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళాడు. పేద రైతులకు సాయం చేస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు.
శంకరమ్మ ఇంటికి వెళ్లి రూ.20 వేలు ఆర్ధికసాయం అందించాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక పల్లవి ప్రశాంత్ ని చాలామంది ట్రోల్ల్స్ చేశారు. ఇస్తామన్న ప్రైజ్ మనీ ఏది, ప్రశాంత్ మోసం చేసాడు, రైతు కార్డు వాడి సింపథీతో గెలిచాడు అంటూ కొంతమంది రీసెంట్ గా వీడియోస్ కూడా చేశారు. నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ నుంచి ఇలాంటి కార్డ్స్ వాడేవాళ్ళను తీసుకెళ్లొద్దు అంటూ కూడా వీడియోస్ చేశారు. సోషల్ మీడియా మొత్తం కూడా పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసింది. బిగ్ బాస్ నుంచి వచ్చాక శివాజీ, బోలె షావలితో కలిసి ఎంతో కొంత హెల్ప్ చేసాడు. ఆ తర్వాత ఆపేసాడు. దాంతో అందరూ కూడా రైతులకు చేస్తామన్న హెల్ప్ ఎందుకు చెయ్యట్లేదు అని కూడా అడిగారు. ఇక ఈ ట్రోల్స్ ఆగేలా లేవు అనుకున్నాడో ఏమో పల్లవి ప్రశాంత్ ఆ కుటుంబానికి సాయం అందించాడు.