English | Telugu

అతి త్వరలో పల్లవి గౌడ కొత్త సీరియల్.. ఎందులోనో తెలుసా?


బుల్లితెర ధారావాహికల్లో కొన్ని సీరియల్స్ ఇప్పటికి, ఎప్పటికి గుర్తుండిపోతాయ్. ఎంతలా అంటే ఎప్పుడో వచ్చిన మొగలిరేకులు, చక్రవాకం, పిన్ని నుండి ఈ మధ్యే ముగిసిన కార్తీక దీపం వరకు అన్నింటిని ప్రేక్షకులు ఆదరించారు.

కంటెంట్ లో కొత్తదనం ఉంటే అది సినిమా అయిన, సీరియల్ అయిన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. కొందరు జీ తెలుగు సీరియల్స్ కి అభిమానులైతే మరికొందరు స్టార్ మాటీవి ,‌జెమినీ టీవీ సీరియళ్ళకి అభిమానులు. అయితే కొత్త సీరియళ్ళకి ఉండే టీఆర్పీ వేరే లెవెల్ లో ఉంటుంది. ఎందుకంటే ఆ సీరియల్ మొదటి ఎపిసోడ్ చూసి బాగుందా? లేదా అనే ఓ అంచనాకి వచ్చి దానిని ఆడియన్స్ రెగ్యులర్ గా చూస్తుంటారు. అయితే స్టార్ మా టోవీలో తాజాగా మొదలైన సత్యభామ, ఊర్వశివో రాక్షసివో సీరియల్స్ మంచి వీక్షకాధరణ పొందుతున్నాయి. కాగా జెమిని టీవీలో రెండు రోజుల క్రితం మొదలైన స్రవంతి సీరియల్ కి ఫుల్ క్రేజ్ వచ్చేసింది.

అయితే త్వరలో జెమిని టీవీలో ఓ ధారవాహిక ప్రారంభం కానుంది‌. దీనిలో పసుపు-కుంకుమ సీరియల్ ఫేమ్ పల్లవి గౌడ హీరోయిన్ గా, తొలి పరిచయంగా హర్షిత్ శెట్టి హీరోగా చేస్తున్నాడు. ఈ సీరియల్ ' ఏవండోయ్ శ్రీవారు' . ఇందులో ఇద్దరు భార్యభార్తలకి గొడవల కారణంగా ఎవరి టైమ్ వారు డిసైడ్ చేసుకొని ఉంటారు. ఇక పల్లవి టైమ్ లో హర్షిత్ తన బట్టలను ఐరన్ చేసుకుంటాడు‌. దాంతో నా టైమ్ లో ఎందుకు చేస్తున్నావంటూ గొడవకి దిగుతుంది పల్లవి. ఇక ఇద్దరి గొడవలో ఆ ఐరన్ చేస్తున్న షర్ట్ కాలిపోతుంది‌. ఇంతలో స్మైల్ అని ఒకతను అనగానే అందరు కలిసి ఫోటోకి ఫోజిస్తారు. మరీ ప్రతీ చిన్నదానికి టైమ్ కేటాయించుకొని ఫోటో అనగానే అందరు కలిసి ఫొజులిచ్చే ఈ విచిత్ర కుటుంబ కథతో వస్తున్న ఈ సీరియల్ ని ఎంతమంది ఆదరిస్తారో చూడాలి మరి. కాగా ఈ సీరియల్ అతి త్వరలో ప్రారంభం కానుంది.