English | Telugu
అమ్మా..నా కూతురిలో నిన్ను చూసుకుంటున్నా..ప్రతి క్షణం
Updated : Jan 9, 2024
బిగ్ బాస్ సీజన్స్ లో బాగా గుర్తుండే సీజన్ సెకండ్ సీజన్ ..ఇందులో కౌశల్ ఆర్మీ ఫుల్ పాపులర్ అయ్యింది. అయితే కౌశల్ ఆర్మీతో తర్వాత కౌశల్ మందా చాల ఇబ్బందులు కూడా పడిన విషయం అందరికీ తెలుసు. ఆ తర్వాత కొంతకాలం అసలు కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఇక ఈ మధ్య యూట్యూబ్‌లో కొంచెం కొంచెంగా కనిపిస్తున్నాడు. అలాగే రీసెంట్ గా ఒక డాన్స్ షోలో కూడా పెర్ఫార్మ్ చేసి అలరించాడు. అలాంటి కౌశల్ ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అది కూడా వాళ్ళ అమ్మ గురించి.. "అమ్మా నువ్వు నన్ను వదిలి 22 ఏళ్లు అయ్యింది.
అయినప్పటికీ, మీ పట్ల నా ప్రేమ , శ్రద్ధ అలాగే ఉన్నాయి. ప్రతిరోజూ నా కూతురిలో మిమ్మల్ని చూసుకుంటున్నా... నేను నీకు చేసిన వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకున్నాను. అది నాకు చాలా గర్వంగా ఉంది. చిన్నప్పుడు అన్నీ గెలవాలని పోటీ పడ్డాను, ఇప్పుడు కూడా నన్ను నేను నిరూపించుకోవడానికి, నన్ను నెగిటివ్‌గా చూసే వారి నోరు మూయించడానికి ప్రతి క్షణం పోరాడుతున్నాను. మీరు నన్ను పైనుంచి చూస్తున్నారని, నాకు మార్గనిర్దేశం చేస్తున్నారని, నాకు శక్తిని ఇస్తున్నారని నాకు తెలుసు. నువ్వు ఎలా కోరుకున్నావో నేను అలాగే ఉన్నాను. ఇప్పుడు నువ్వు మాతో లేవనే నిజాన్ని నమ్మడం కష్టంగా ఉంది. కానీ నా కళ్ల ముందు నువ్వు ఉన్నట్లు ప్రతి క్షణం నీ ఉనికిని అనుభవిస్తున్నాను. మీ లోకంలో మీరు ప్రశాంతంగా ఉండండి అమ్మ. మీ ప్రేమ, జ్ఞాపకాలు ఎప్పుడూ నాతో ఉంటాయి." అంటూ బాధతో ఒక సుదీర్ఘ మెసేజ్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. ఐతే కౌశల్ ఎక్కడుంటే అక్కడ కాంట్రవర్సీలు అతని వెంటే ఉంటాయి. త్వరలో తాను ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా చేస్తున్నానని అది కూడా రూ. 250 కోట్లు బడ్జెట్ మూవీ చెప్పాడు కౌశల్...