English | Telugu

ఆట సందీప్ కొత్త సినిమా టీజర్ లాంఛ్.. అటెండ్ అయిన స్పై బ్యాచ్!

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. దీనికి కారణం శివాజీనే అనేది అందరికి తెలిసిందే. ‌యావర్ , ప్రశాంత్ లని సీజన్ సెవెన్ ఫినాలే వరకు కాపాడుకుంటూ వచ్చాడు శివాజీ.

ఇక హౌస్ లో శివాజీ, ప్రశాంత్, యావర్ ముగ్గురు కలిసి ఓకే మాట ఒకే బాణంలాగా ఉండేవాళ్ళు. అందుకే వీరిని స్పై అని ముద్దుగా పిలుచుకుంటారు. ‌కాగా స్పా బ్యాచ్ తో ఎక్కువగా ట్రావెల్ అయిన హౌస్ మేట్ ఆట సందీప్. ఆట సందీప్, అమర్ దీప్ తో కలిసి ఎన్నో గేమ్స్, టాస్క్ లలో ఫౌల్ చేశాడు. ఇక మొట్ట‌మొదటి హౌస్ మేట్ గా గెలిచి ఆరువారాల ఇమ్యూమిటీ పొంది నామినేషన్ లో లేడు. ఆ తర్వాత కెప్టెన్ గా గెలిచి మరో వారం నామినేషన్ లో మిస్ అయ్యాడు.‌ ఇక తొమ్మిదవ వారం టేస్టీ తేజ నామినేషన్ చేయడంతోనే ఎలిమినేషన్ అయి బయటకొచ్చాడు ఆట సందీప్.‌ తొమ్మిది వారాలు ఓ కంటెస్టెంట్ నామినేషన్ లో ఉండకుండా హౌస్ లో ఉండటం ప్రథమం అయితే బయటకు రావడం ఇదే తొలిసారి జరిగింది. ‌ఇక హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రియాంక జైన్, శోభాశెట్టి, అమర్ దీప్ లతో ఎక్కువ స్నేహంగా ఉన్న ఆటసందీప్.. ఆ తర్వాత ఎలిమినేషన్ అయి బయటకొచ్చాక‌ ఎవరు జెన్యున్ ప్లేయర్? ఎవరు గ్రూప్ గా ఆడుతున్నారో‌ తెలుసుకొని పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేశాడు. ఇక భోలే షావలి ఎలిమినేషన్ తర్వాత ఆటసందీప్, అతని భార్య జ్యోతిరాజ్ వాళ్ళింటికి వెళ్ళి మరీ కలిసారు. ఇక శుభశ్రీ, టేస్టీ తేజ కలిసి రీల్స్ తో‌ బిజీగా ఉంటున్నారు. ఇక తాజాగా మూవీ షూటింగ్ లో‌ బిజీ ఉన్నానని చెప్పిన ఆట సందీప్.. ఆ కబురు చెప్పేశాడు. ఆట సందీప్ బిగ్ బాస్ ఫ్రెండ్స్ తో కలిసి తన సినిమా టీజర్ లాంఛ్ ని గ్రాండ్ గా రిలీజ్ చేశాడు.

ఆట సందీప్ కొత్త సినిమా ' షార్ట్ కట్' టీజర్ లాంఛ్ నిన్న జరిగింది. దీనికి బిగ్ బాస్ హౌస్ మేట్స్.. శివాజీ,‌‌ ప్రశాంత్, యావర్ భోలే షావలి, అశ్వినిశ్రీ, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ అటెండ్ అయ్యారు.‌‌ఇక ప్రశాంత్ ని కలిసిన ఆటసందీప్ భార్య.. అన్నా అంటూ ఆత్మీయంగా హత్తుకుంది.‌ ఆ తర్వాత జై జవాన్ జై కిసాన్ అంటు గట్టిగా అరుస్తూ తనకి రైతులపై ఉన్న ఇష్టాన్ని, ప్రశాంత్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకుంది. ఆ తర్వాత టీజర్ లాంఛ్ లో భాగంగా.. బిగ్ బాస్ హౌస్ మేట్స్ మాట్లాడారు. శివాజీ బాగుందని చెప్పాడు. ఇక ప్రశాంత్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అలాగే అశ్వినిశ్రీ, భోలే షావలి తమ అభినందనలు తెలిపారు. ఇక గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. నా డ్యాన్స్ ని చాలామంది ట్రోల్స్ చేశారు. చాలామంది నా డ్యాన్స్ చూసి నవ్వుకున్నారు. అఫ్ కోర్స్ నేను కూడా నవ్వుకున్నాను. ఇక ఇప్పుడు ఆట సందీప్ కి ఓ భాద్యత అప్పగించాను. నాకు డ్యాన్స్ నేర్పించమని చెప్పానని గౌతమ్ కృష్ణ అన్నాడు. ఇక యావర్, ఆట సందీప్ తో‌ కలిసి కొన్ని డ్యాన్స్ స్టెప్పులు కూడా వేశాడు. ఇక స్పై బ్యాచ్ ని ఒకే స్క్రీన్ మీద చూసిన స్పై బ్యాచ్ అభిమానులు ఇన్ స్టాగ్రామ్ లలో స్టాటస్ లు పెట్టేస్తున్నారు.