English | Telugu

పెద్ద రోజ్ కి రోజ్ బొకే ఇచ్చినట్టుంది..డాన్స్ ఐకాన్ స్టేజిపై రాశీఖన్నాను పొగిడిన ఓంకార్

డాన్స్ ఐకాన్ ఒక రేంజ్ లో టాప్ షోస్ తో సమానంగా దూసుకుపోతోంది. ఆహా ఓటిటి ప్లాట్ఫారం పై ఈ డాన్స్ షో వస్తోంది. ఈ షో ప్రతి శని, ఆదివారాలు రాత్రి 9 గంటలకు స్ట్రీమ్ అవుతోంది. ఇప్పటివరకు ఈ డాన్స్ ఐకాన్ షో 14 ఎపిసోడ్ లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక ఈ వారం ప్రసారం కాబోయే 15, 16వ ఎపిసోడ్ లకు సంబంధించి లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ కొత్త ప్రోమోలో కంటెస్టెంట్ లతో పాటు శేఖర్ మాస్టర్ పెర్ఫార్మన్స్ కూడా ఓ రేంజ్ లో అదిరిపోయింది. అయితే.. రాబోయే ఎపిసోడ్ కి స్పెషల్ గెస్ట్ గా స్టార్ హీరోయిన్ రాశిఖన్నా ఎంట్రీ ఇచ్చింది. అలాగే షోలో స్టేజిపై యష్ మాస్టర్ తో కలిసి స్టెప్పులేసి సర్ప్రైజ్ చేసింది.

ఇక హోస్ట్ ఓంకార్ వచ్చి బొకే ఇస్తూ " ఒక పెద్ద రోజ్ కి రోజ్ బొకే ఇచ్చినట్టు ఉంది" అని రాశీఖన్నాని గులాబీ పువ్వుతో పోల్చాడు. ఇక ఈ లేటెస్ట్ ఎపిసోడ్ థీమ్ "జడ్జెస్ ఛాలెంజ్" రౌండ్. ఇక సౌమ్య తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఇరగదీసింది..కానీ రిజెక్ట్ అయ్యేసరికి మోనాల్ చాలా ఎమోషనల్ అయ్యింది. "ఎవరైనా తక్కువగా డాన్స్ చేస్తే ఒక రెడ్ ఇస్తారు..కానీ మనం ఎంత కష్టపడి చేసినా టు రెడ్స్ ఇచ్చేస్తారు..ఎందుకంటే జడ్జెస్ మన నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు" అని ఆ కంటెస్టెంట్ కి చెప్పింది. ఇలా ఈ వారం డాన్స్ ఐకాన్ ఎంటర్టైన్ చేయబోతోంది.