English | Telugu

ఇనాయ ఏది చేసినా అది కంటెంట్ అవుతోంది

బిగ్ బాస్ లో ఆడే కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యాక వాళ్ళను బీబీ కేఫ్ కి తీసుకొచ్చి కాంట్రావర్సీ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు యాంకర్స్. పనిలో పనిగా హౌస్ మేట్స్ కి సంబందించిన వాళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళ గురించి మాట్లాడిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇనాయ క్లోజ్ ఫ్రెండ్ రణతిని ఆరియానా గ్లోరీ బీబీ కేఫ్ కి తీసుకొచ్చి ఎన్నో ప్రశ్నలు అడిగింది. "మీరు ఇనాయాకి ఎలా పరిచయం" అనేసరికి "మనం ఎలాంటి ఫ్రెండ్స్ ఉండాలి అనుకుంటామో ఇనాయా కూడా అలాగే ఉంటుంది..ఎలాంటి విషయాన్నైనా బయటికి చెప్పేస్తుంది... సీక్రెట్ అనేది మెయింటైన్ చేయదు " అని చెప్పాడు. " మరి హౌస్ లో కూడా అలాగే ఉందా" అనేసరికి "హౌస్ లో మాస్క్ లేకుండా ఎవరైనా ఉన్నారు అంటే అది ఇనయానే" అని ఆన్సర్ ఇచ్చాడు. "మెజారిటీ ఆఫ్ హౌస్ మేట్స్ ఇనాయని ఫేక్ అంటున్నారు కదా" అని అడిగింది అరియానా.."సూర్యని ఆమె నామినేట్ చేసింది. సూర్య వెళ్లిపోయేటప్పుడు ఏడ్చేసింది. " ఏమిటిది అని అడిగేసరికి "లవ్ లాంటిది ఏమీ లేదు" అన్నాడు .

"ఇనాయ గేమ్ ప్లాన్ కి సూర్య బలయ్యాడని అనిపించిందా" అనేసరికి "లేదు మనుషులతో గేమ్ ఆడే టైపు కాదు" అన్నాడు. "సూర్య మీద ఇనాయ ఫీలింగ్ నిజమేనంటారా" అని అడిగింది. "ఫ్రెండ్ గా ఐతే ఇనాయ ఫీలింగ్ నిజమే" అని తెలివిగా ఆన్సర్ చేసాడు . "మరి క్రష్ అనేది ఏమిటి" అనేసరికి "ఇష్టం వేరు, ప్రేమ వేరు" అన్నాడు. "ఆడియన్స్ సూర్య, ఇనాయ రిలేషన్ షిప్ ని ఎలా తీసుకుంటున్నారు" అని అనేసరికి " ఏదో ఒకరకంగా సెన్సేషన్ ఐతే అవుతోంది కదా" అన్నాడు .."ఇనాయ చిన్న చిన్న విషయాలను కూడా పెద్ద ఇష్యూ చేస్తుందని ఆడియన్స్ అంటున్నారు..మరి మీ ఒపీనియన్" అని అడిగేసరికి "ఇనాయ కంటెంట్ కోసం చేయదు..తాను ఏది చేసినా అది కంటెంట్ అవుతోంది" అన్నాడు..మరి రణతితో చేసినా ఈ ఇంటర్వ్యూ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.