English | Telugu
నేను ఆంటీ ఐతే మీరు తాతయ్య ఐనట్టే కదా!
Updated : Nov 3, 2022
'ఆంటీ' అనే పదం కొన్ని నెలల ముందు అనసూయ కారణంగా ఎంత సెన్సేషన్ సృష్టించిందోచెప్పాల్సిన పని లేదు. దీని మీద చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి. ఇలాంటి టైంలో లేటెస్ట్ గా మరోసారి ఆంటీ వివాదం తెర మీదకు వచ్చింది. శ్యామలని "ఆంటీ" అని సంభోదించాడుసీనియర్ నటుడు రాజా రవీంద్ర. నవంబర్ 4న ‘తగ్గేదే లే’ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నాడు రవీంద్ర.
ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో రాజా రవీంద్ర మాట్లాడుతూ‘‘మా ప్రొడ్యూసర్స్ ప్రేమ్, అఖిల్, సుబ్బారెడ్డి మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీకి వచ్చారు. వాళ్లు తలుచుకుంటే ‘బాహుబలి’ లాంటి పది సినిమాలు తీయగలరు కానీ అలాంటివి కాకుండా ఆడియన్స్ కోసం మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే చాలు అనుకుంటున్నారు. అందుకే ఈ ‘తగ్గేదేలే’ అనే మూవీని తీశారు. కరోనా టైంలో ఎంతో కష్టపడి ఈ సినిమాకి పని చేసాం. అలాగే భద్ర ప్రొడక్షన్ కంపెనీ, నిర్మాతలు అందరినీ ఎంతో బాగా చూసుకున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం పని చేసిన అందరికీ ముందుగానే వ్యాక్సిన్‌లు వేయించి టైంకి పేమెంట్స్ కూడా ఇచ్చేసారు’’ అని చెప్పాడు.
ఇలా అందరికీ ధన్యవాదాలు చెబుతూ.. ఫైనల్ గా "శ్యామలా ఆంటీకి కూడా థాంక్యూ" అంటూ ఆమెపై కౌంటర్ వేశాడు. రాజా రవీంద్ర మాటలకు షాకైన శ్యామలవెంటనే రివర్స్ కౌంటర్ పేల్చింది.. "నేను ఆంటీ ఐతే మీరు తాతయ్య అయిపోయినట్టే" అని రిటార్ట్ ఇచ్చింది.