English | Telugu

ప్రాణం పోయినా సరే అబ్బాయి వెనకాలే నిలబడతా


జబర్దస్త్ లో శ్రీదేవి డ్రామా కంపెనీలో నూకరాజు స్కిట్స్ బాగా ఫేమస్. ఇమ్మానుయేల్, నూకరాజు, ఆసియా వీళ్లంతా కలిసి స్కిట్స్ వేస్తూ ఉంటారు. ఇక నూకరాజు - ఆసియా ఇద్దరూ మంచి స్నేహితులు అన్న విషయం అందరికీ తెలిసిందే కదా. ఐతే రీసెంట్ గా వీళ్ళు ఒక రీల్ చేశారు. "ఆసియా ఒక్క నిమిషం. నిన్నొకటి అడుగుతాను చెప్పు. ఒక అబ్బాయి, అమ్మాయి లవ్ చేసుకుని రిలేషన్ లో ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇద్దరూ కలిసి సాల్వ్ చేసుకుని హ్యాపీగా ఉండాలా ఓన్లీ అబ్బాయి ఒక్కడే సాల్వ్ చేయాలా" అని అడిగాడు.

"ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి ఇద్దరూ కలిసి సాల్వ్ చేసుకోవాలి." అని చెప్పింది. "ఒకవేళ నువ్వు ఆ పరిస్థితిలో ఉంటె ఎం చేస్తావ్" అని అడిగాడు. "నేనే ఆ పరిస్థితిలో ఉంటె గనక కచ్చితంగా అబ్బాయి వెనకే నిలబడతా" అని చెప్పింది. "అదేంటి మీ ఇంట్లో పరువు పోతుందని ఏమీ ఆలోచించావా" అని మళ్ళీ అడిగాడు. "పరువే కాదు ప్రాణం పోయినా సరే అబ్బాయి వెనకే నిలబడతా.. ఎందుకంటే ప్రేమించాను కదా" అని చెప్పింది. ఆ మాటలకు నూకరాజు నోరెళ్ళబెట్టుకుని అలా నిల్చుండిపోయాడు.


ఈ విషయం మీద నెటిజన్స్ కూడా రియాక్ట్ అయ్యారు. "ఇద్దరూ కలిసి సాల్వ్ చేసుకోవాలి..ఆసియ కరెక్ట్ గా చెప్పింది. ఈ రోజుల్లో అలా ఏమీ లేరు. ప్రతి ఒక్క అమ్మాయి ఇలా ఆలోచిస్తే లవ్ ఫెయిల్యూర్ అనేది ఉండదు.. ఆసియా, నూకరాజు సూపర్ ..మేడ్ ఫర్ ఈచ్ అదర్ " అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆసియా నూకరాజుతో కలిసి స్కిట్స్ లో పార్టిసిపేట్ చేసేది కానీ ప్రస్తుతం నూకరాజు మిగతా కంటెస్టెంట్స్ తో స్కిట్స్ చేస్తున్నాడు.