English | Telugu
ఈ మంచు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Updated : Nov 30, 2025
బుల్లితెర మీద జబర్దస్త్ రాంప్రసాద్, హైపర్ ఆది ఈ మధ్య కాలం బాగా ఫేమస్ అయ్యారు. ఇక వీళ్ళు మిగతా వాళ్ళ మీద వేసే పంచులు వేరే లెవెల్ లో ఉంటాయి. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంద్రజ చెప్పే మాటలు మీద వీళ్ళు రెగ్యులర్ గా సెటైర్స్ వేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ రీసెంట్ గా స్విట్జర్లాండ్ వెళ్లారు. అక్కడ మంచులో బాగా ఎంజాయ్ చేశారు. ఆ వీడియోస్ ని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ఐతే అక్కడ ఉన్న మంచు మీద ఇంద్రజ కామెంట్ చేయాల్సి వస్తే ఎలా చేస్తారు అనే విషయం మీద వీళ్ళు చెప్పిన కామెంటరీ ఫుల్ ఫన్నీగా ఉంది. "ఆది ఇంద్రజ గారు స్విజర్లాండ్ వచ్చి ఉంటె ఈ మంచును చూసి ఏమనేవారు" అని రాంప్రసాద్ అడిగాడు. "ఈ మంచు పది కాలాల పాటు చల్లగా ఉండాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." అన్నాడు.
వెంటనే రాంప్రసాద్ "వావ్ ఇట్స్ ఏ సిజలింగ్ పెర్ఫార్మెన్స్." అని అన్నాడు. "సిజలింగ్ మంచు" అని చెప్పు ఇద్దరూ నవ్వుకున్నారు. ఇక నెటిజన్స్ కూడా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. "అక్కడ కూడా అమ్మను వదలట్లేదు, జబర్దస్త్ జోక్స్, ఇంకా ఏమంటారంటే ఆ మంచులో డెప్త్ ఉంది, సుధీర్ అన్న రాలేదా, మాకు సుధీర్ అన్న కావాలి." అంటూ కామెంట్స్ చేశారు. ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎవరినీ ఇబ్బంది పెట్టె కామెంట్స్ చేయరు. అంతా బాగుంది, బాగా చేశారు ఎవరైనా పాటలు పాడితే డెప్త్ ఉంది అంటూ పాజిటివ్ గా కామెంట్ చేస్తారు.