English | Telugu

ఢీ - 20 లో ఎవరు ఎలిమినేట్ ఐతే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు?


ఢీ షో ఎలిమినేషన్స్ దగ్గర పడ్డాయి. ఐతే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం మీద డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇక దీని మీద రీసెంట్ ఈటీవీ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. జతిన్, సిజ్లింగ్ సుష్మిత, కండక్టర్ ఝాన్సీ, పండు మాష్టర్, అన్షు రెడ్డి, రాజా నందిని, మణికంఠ, జానూ లిరి, అభి మాష్టర్, సంకేత, భూమిక, రాజు. వీళ్ళ లిస్ట్ ఇచ్చి "మీరే గనక ఎలిమినేట్ చేయాల్సి వస్తే ఎవరిని ఎలిమినేట్ చేస్తారో కింద కామెంట్ చేయండి.

ఎలిమినేషన్ ఫీవర్ ని ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉండండి " అంటూ ఒక టాస్క్ ఇచ్చింది. దీంతో నెటిజన్స్ కామెంట్స్ వరద కురిపించారు. "అన్షు రెడ్డికి డాన్స్ రాదు. జానుకి ఎక్స్ప్రెషన్స్ రావు, సుస్మిత, అన్షు రెడ్డి, జానూని ఎలిమినేట్ చేస్తాను, భూమికను ఎలిమినేట్ చేస్తాను" అంటూ చెప్తున్నారు. ఎలిమినేషన్ కంటే కప్పు ఎవరు కొడతారు అనే విషయం మీద కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. సంకేత్, రాజు, జతిన్ వీళ్లల్లో ఎవరైనా కప్పు కొడతారు అని కొంతమంది అంటే కాదు పండు ఈ సీజన్ కప్పు కొడతాడు అంటున్నారు.


అమ్మాయిలందరినీ ఎలిమినేట్ చేయండి అని కొందరు కామెంట్ చేస్తే ఈసారి కప్పు పల్సర్ బైక్ ఝాన్సీ సొంతం చేసుకుంటుంది అంటున్నారు. పండుకే ఈ కప్పు సొంతం కావాలి. మంచి డాన్సర్ మంచి ఎంటర్టైనర్ కూడా అంటున్నారు. ఇక పండు ఐతే రీసెంట్ గా చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే సీజన్ 5 లో కుకింగ్ కంటెస్టెంట్ గా వచ్చాడు. మరి ఢీ షోలో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు టైటిల్ విన్ అవుతారో చూడాలి.