English | Telugu
జ్వాల ముందే హిమకు తాళి కట్టి షాకిచ్చిన నిరుపమ్!
Updated : Jun 14, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `కార్తీక దీపం`. గత కొంత కాలంగా మహిళా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ విజయవంతంగా ముందుకు సాగిపోతోంది. ఈ మంగళవారం ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఈ రోజు ఎపిసోడ్ లో ఏడు అడుగులు వేయమంటూ జ్వాల అడుగుల కోసం పూలతో అలంకరిస్తుంది హిమ.. మధ్యలో నిరుపమ్.. అటు ఇటు హిమ, జ్వాల. నిరుపమ్ దగ్గరికి పూలపై అడుగులు వేస్తూ వెళుతూ వుంటుంది జ్వాల.. ఏడో అడుగు వేసే సమయంలో జ్వాలకు ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఆ ఫోన్ కాల్ చేసింది శోభ. జ్వాల ఎవరు అని అడగ్గా, శోభ తను ఎవరో తెలియనీయకుండా రాక్షస నవ్వు నవ్వి 'ఎలా వున్నావు జ్వాల' అంటుంది. 'నేను హిమని' అని అబద్ధం చెబుతుంది. అంతే కాకుండా తనంటే చిరాకు వచ్చేలా చేస్తుంది. 'నేను అడ్రస్ చెబుతాను నువ్వు రావాలి. లేట్ చేస్తే మనసు మార్చుకుంటాను' అని చెప్పడంతో జ్వాల తన కోసం పరుగులు తీస్తుంది. ఇదంతా చాటునుంచి గమనిస్తున్న శోభ రాక్షస ఆనందం పొందుతుంది.
"ఏంటి బావా.. జ్వాల ఇలా వెళ్లిపోయింది?" అని హిమ అంటుంటే, "తను ఏడో అడుగు వేసి వుంటే నిన్ను నేను ప్రేమించడం లేదు. ప్రేమించను కూడా అని జ్వాలకు చెప్పే వాడిని" అంటాడు. దీంతో హిమ షాక్ అవుతుంది. "ఏంటిది?" అంటూ సీరియస్ అవుతుంది. కట్ చేస్తే.. హిమను గుడికి తీసుకొచ్చిన నిరుపమ్ అక్కడే తాళికడతాడు. మన ఇద్దరినీ విడదీసే హక్కు ఎవరికీ లేదంటూ అసలు విషయం చెబుతాడు. ఆ సీన్ చూసిన జ్వాల ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తరువాత ఏం జరిగింది అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.