English | Telugu
నయని పోటీలో గెలవకుండా కసి, వల్లభ కుట్ర
Updated : Jun 14, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `త్రినయని`. జరగబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టే వరం వున్న ఓ యువతి కథ నేపథ్యంలో ఈ సీరియల్ ని రూపొందించారు. అషికా గోపాల్, చందూ గౌడ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇతర పాత్రల్లో నిహారిక హర్షు, ప్రియాంక చౌదరి, విష్ణు ప్రియ, శ్రీసత్య, భావనా రెడ్డి, పవిత్ర జయరామ్, చల్లా చందు, అనిల్ చౌదరి, సురేష్ చంద్ర తదితరులు నటించారు. గత కొన్ని వారాలుగా విజయవంతంగా సాగుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సీరియల్ ని రూపొందించారు.
`గానవి` ఇండస్ట్రీస్ ని ప్రారంభించడానికి పెట్టుబడి లేకపోవడంతో సైకిల్ పోటీల్లో గెలిచిన మహిళకు రూ. 10 లక్షలు బహుమతి అనే ప్రకటన చూస్తుంది నయని. ఈ పోటీలో పాల్గొని పది లక్షలు సొంతం చేసుకుని ఫ్యాక్టరీని మొదలు పెడతామంటుంది. దీనికి విశాల్ ముందు అంగీకరించకపోయినా ఆ తరువాత ఓకే అంటాడు. ఈ విషయం తెలుసుకున్న కసి, వల్లభ ఈ పోటీలో నయని గెలవకూడదని కుట్ర చేస్తారు. కసిని కూడా రంగంలోకి దింపుతారు. ఇదే సమయంలో వల్లభ భార్య హాసిని కూడా నయనికి అండగా పోటీ కి దిగుతుంది.
నయని చెల్లెలు కూడా పోటీలోకి రావడంతో ఏం జరుగుతోందో నయనికి అర్థం కాదు. ఈ లోగా పోటీ మొదలవుతుంది. నయని దూసుకువెళుతుంటే ముందుగా రౌడీలని ఏర్పాటు చేసిన వల్లభ తనని అక్కడే అంతం చేయమని రౌడీలతో చెబుతాడు. దారి తప్పిన నయని ఎలాగోలా బయట పడుతుంది. అయినా సరే తనని ముందుకు వెళ్లనీయకూడదని కసి ఏర్పాటు చేసిన లేడీస్ నయనని కింద పడేస్తారు. హాసిన వచ్చి నయనిని లేపుతుంది. అక్కడి నుంచి హాసిని, నయని ఒకే సైకిల్ పై వస్తుంటారు. నయని స్పీడు పెంచుతుంది. అది చూసిన విశాల్ కమాన్ కమాన్ అంటూ అరుస్తుంటాడు. ఆ తరువాత ఏం జరిగింది? నయని అనుకున్నట్టే సైకిల్ పోటీలో విజయం సాధించిందా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.