English | Telugu

శోభాశెట్టిని ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ కి నెటిజన్ల కామెంట్లు!

బిగ్ బాస్ సీజన్-7 లో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లలో మోస్ట్ అన్ డిజర్వింగ్ కంటెస్టెంట్ ఎవరు? అని ఎవరిని అడిగినా శోభా శెట్టి పేరే చెప్పేస్తారు ప్రేక్షకులు. దీనికి కారణం హౌస్ లో శోభాశెట్టి వరెస్ట్ బిహేవియర్.

శోభాశెట్టి సీరియల్ బ్యాచ్ లో మెయిన్ లీడ్ చేస్తుంది. ఒకానొక దశలో ఈమెతో మనకెందుకు అనుకుంటున్నారు తోటి హౌస్ మేట్స్. అంతలా నోరేసుకొని పడిపోతుంది. సోమవారం జరిగిన నామినేషన్లో భోలే షావలితో జరిగిన ఇష్యూ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. నిన్న జరిగిన కెప్టెన్సీ కంటెండర్ పోటీలో నిలిచిన శోభాశెట్టికి అన్ డిజర్వింగ్ ఇచ్చాడు యావర్. అతను కారణం చెప్తూ.. నీకు నేను లాస్ట్ టైమ్ డిప్యూటీ ఇస్తానంటే వద్దన్నావ్? ఎందుని అడుగగా.. నాకు కెప్టెన్సీ కావాలి. నీ డిప్యూటీ అక్కర్లేదని అంది. పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ ల మధ్య గొడవ జరిగినప్పుడు భోలే షావలితో శోభాశెట్టి గొడవకి దిగింది‌. ఇక ఈ వారం జరిగిన టాస్క్ లో ఫౌల్ గేమ్ ఆడుతూ.. గ్రూప్ గా ఆడుతూ, చివరికి గ్రూప్ గా నామినేషన్ చేశారు. ఇంత ఫౌల్ అండ్ అన్ ఫెయిర్ గేమ్ ఆడుతున్న శోభాశెట్టిని చూసిన ప్రేక్షకులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

అమర్ దీప్ బూతులు మాట్లాడితే పట్టించుకోకుండా భోలే ఒక్క బూతు మాట అన్నాడని ప్రియంక, శోభాశెట్టి పెద్ద రచ్చ చేశారు. అయితే భోలే షావలి ఎన్ని సార్లు సారీ చెప్పిన శోభాశెట్టి అంగీకరించకుండ ఆ గొడవని మరింత ల్యాగ్ చేస్తుంది. కంటెంట్ కోసం ఇదంతా చేస్తుందని అందరికి అర్థమైంది. దీంతో బిగ్ బాస్ రెగ్యులర్ గా చూసే అభిమానులు.. ప్రతీ ప్రోమో కింద శోభాశెట్టిని ఎలిమినేట్ చేయండి బిగ్ బాస్. ఆ నోరు ఆ వాలకం చూడలేకపోతున్నాం అంటూ వారి నిరసనని వ్యక్తం చేస్తున్నారు.