English | Telugu
ఆట సందీప్, శోభాశెట్టి డబుల్ ఎలిమినేషన్.. బిగ్ బాస్ ఉల్టా పల్టా ట్విస్ట్!
Updated : Oct 28, 2023
బిగ్ బాస్ సీజన్-7 మొదట పద్నాలుగు మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో ఆట సందీప్ మొదటి హౌస్ మేట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మూడు వారాలకు అందరిని హౌస్ మేట్స్ ని చేసేశాడు బిగ్ బాస్.
ఈ వారం జరిగిన హౌస్ నుండి బయటకు వెళ్ళడానికి జరిగిన నామినేషన్లలో ఆట సందీప్ ఉన్నాడు. ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలో ఏడు వారాలు నామినేషన్లో ఉండకుండా హౌస్ మేట్ ఉన్న ఏకైక కంటెస్టెంట్ 'ఆట సందీప్'. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ప్రతీవారం ఓటింగ్ రిజల్ట్స్ బట్టి ఎలిమినేషన్ ఇస్తూ వచ్చాడు. అయితే ప్రతీ టాస్క్ లోను అమర్ దీప్, శోభాశెట్టి, ఆట సందీప్, ప్రియాంక జైన్, టేస్టీ తేజ కలిసి ఫౌల్ చేస్తూ ఎలాగోలా గెలవాలని చూస్తున్నారు. అయితే వీరి అన్ ఫెయిర్ గేమ్ చూసి అందరికి వీరంటే విపరీతమైన నెగెటివిటి ఏర్పడింది. అయితే ఇప్పుడు నామినేషన్లో ఉన్నవారిలో శివాజీ, భోలే షావలి, అమర్, ప్రియాంక సేఫ్ జోన్ లో ఉండగా.. అశ్వినిశ్రీ, ఆట సందీప్, శోభాశెట్టి చివరి స్థానంలో ఉండి ఎలిమినేషన్ కి దగ్గరగా ఉన్నారు.
అయితే గతవారం పూజామూర్తి ఎలిమినేషన్ లో ఇదే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. అశ్వినిశ్రీ, పూజామూర్తి ఉండగా పూజామూర్తిని ఎలిమినేషన్ చేశాడు. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ నిజమే అయితే ఆట సందీప్, శోభాశెట్టి ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. ఎందుకంటే అశ్వినిశ్రీ అత్యధికంగా ఓటింగ్ నమోదైంది. ఇక ఆట సందీప్, శోభాశెట్టి ఇద్దరు అన్ డిజర్వింగ్ కంటెస్టెంట్స్ అని ప్రేక్షకులు గట్టిగా ఫిక్స్ అయినప్పటికీ.. శోభాశెట్టి ఆటతీరు, నోరేసుకొని పడిపోవడంతో తన మాట తీరు రెండూ సరిగ్గా లేవని లైవ్ చూస్తున్న ప్రేక్షకులకి అర్థమై.. ప్రతీ ప్రోమో కింద కామెంట్లలో శోభాశెట్టి, ఆట సందీప్ ని ఎలిమినేషన్ చేయాలంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి బిగ్ బాస్ ఉల్టా పల్టా ట్విస్ట్ ఇవ్వనున్నాడా లేదా తెలియాలంటే ఆదివారం నాటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.