English | Telugu

రతిక చేతిలో ప్రశాంత్ చేయి.. శివాజీ పెద్దరికం!

బిగ్ బాస్ సీజన్-7 లో రోజు రోజుకి ట్విస్ట్ లు పెరిగిపోతున్నాయి. నిన్న మొన్నటి దాకా రతికకి పల్లవి ప్రశాంత్ దూరంగా ఉంటూ టాస్క్ లు బాగా ఆడుతూ టాప్-5 రేస్ లో దూసుకెళ్తున్నాడు. అయితే రతిక రీఎంట్రీ తర్వాత మళ్లీ కొత్త కథ మొదలైంది.

రతిక వచ్చీ రాగానే శివాజీ కాళ్ళ మీద పడి మారిపోయానని చెప్పింది‌. ఇక హౌస్ లోకి వచ్చాక రెండు, మూడు రోజుల దాకా డీసెంట్ గా ఉంది. ఇక మూడవ రోజు నుండి యావర్ తో మంతనాలు మొదలుపెట్టింది. అన్నీ లేనిపోనివి చెప్పి యావర్ ని తనకే సపోర్ట్ చేసేలా గ్రిప్ లో పెట్టుకున్న రతిక.. మరో సపోర్ట్ కోసం కోసం ప్రశాంత్ ని అక్క అని వద్దని, రతిక అని పిలవమని గత రోజంతా విసిగించింది. తనెంత విసిగించిన పల్లవి ప్రశాంత్ అస్సలు వినలేదు. అక్క అనే పిలుస్తానని అన్నాడు. అయితే యావర్ మధ్యలోకొచ్చి ఏం అయింది ఎందుకంత బాధ అని ప్రశాంత్ ని అడుగగా.. "నన్నేమైనా పడుతా కానీ మా అమ్మనాన్నలని అన్నది" అని ఏడ్చేశాడు. ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ అలా మాట్లాడాను దానికి సారీ అంటూ రతిక చెప్పింది‌. అయిన పల్లవి ప్రశాంత్ మారలేదు. ఇక రతిక కూడా కంటతడిపెట్టుకుంది.

కాసేపటికి శివాజీ రాగా.. రతిక బోరున ఏడుస్తూ అసలు విషయం చెప్పింది. వాడు నాకు దేవుడిచ్చిన చైల్డ్. వచ్చిన మొదట్లో వాడు ఏడుస్తుంటే అందరిలా నటన అని అనుకునేవాడిని. కానీ వాడు జెన్యున్ ఎందుకంటే నేను దగ్గరనుండి చూశా చాలా మంచోడు. నువ్వు అలా అనేసరికి తట్టుకోలేకపోయాడు. నీ ఆట నువ్వు ఆడు అని చెప్పానని రతికతో శివాజీ అన్నాడు. ‌ఇక హౌస్ లో అందరం ఫ్రెండ్స్ లానే ఉందామని పల్లవి ప్రశాంత్ కి శివాజీ చెప్పాడు. చేతిలో చేయి కలుపు అని ప్రశాంత్ తో శివాజీ అనగానే.. సరే అని రతిక చేతిలో చేయి వేసి ఇకనుండి ఫ్రెండ్స్ అని అన్నాడు. ఇక రతిక ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక నుండి ఆట ఎలా ఉండబోతుందో చూడాలి మరి.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..