English | Telugu
నెటిజన్‌లకు అడ్డంగా బుక్కైన బిగ్ బాస్ బ్యూటీ!
Updated : Feb 22, 2022
దేత్తడి హారిక బిగ్ బాస్ సీజన్ 4లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. టాప్ 5 వరకు వెళ్లి తన సత్తా చాటిన హారిక నెట్టింట ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా వుంటూ నెటిజన్ లకు అందుబాటులో వుంటోంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ , ట్విట్టర్.. ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ని వదలకుండా తనని తాను వైరల్ చేసుకోవడం కోసం వరుస పోస్ట్ లతో నెటిజన్ లకు పిచ్చెక్కిస్తోంది. వరుస ఫొటో షూట్ లు.. డ్యాన్సింగ్ వీడియోలతో తనలో వున్న నటిని కూడా పరిచయం చేస్తోంది.
దేత్తడి హారిక వీడియోలపై కొంతమంది ప్రశంసల్ని కురిపిస్తుంటే మరి కొంతమంది "ఇక ఈ రచ్చ ఆపవమ్మా తల్లీ" అంటూ ట్రోల్ చేస్తున్నారు. హైట్ తక్కువగా వుండటంతో హారికపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు. ఈ మధ్యే ఇలాంటి ట్రోల్స్ కి దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది హారిక. "బుడ్డది అంటే గుడ్డలూడదీసి కొడతా" అని ఎన్టీఆర్ డైలాగ్ ని వాడేస్తూ ఓ వీడియో చేసి మరీ వార్నింగ్ ఇచ్చింది. అయితే తాజాగా దేత్తడి హారిక చేసిన ఓ పని ఆమెని నెటిజన్ లకు అడ్డంగా బుక్కయ్యేలా చేసింది.
Also Read:పునీత్ కుటుంబంలో మరో విషాదం
తన నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ తనకి తానే `ఎక్స్‌ప్రెస్ క్లీన్` అని బిరుదు ఇచ్చేసుకుంది. భిన్నబైన హావభావాల్ని పలికిస్తూ ఓ వీడియోను వదిలింది. అయితే ఇక్కడే అడ్డంగా దొరికిపోయింది. ఎక్స్‌ప్రెషన్ స్పెల్లింగ్ తప్పుగా రాయడంతో ఆమెని ఇప్పుడు నెటిజన్స్ ఆడేసుకుంటున్నారు. 'స్పెల్లింగ్ కరెక్ట్ గా రాయడం నేర్చుకో' అంటూ దేత్తడి హారికని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపై హారిక ఎలా స్పందిస్తుందో.. ఎలాంటి వీడియోతో ట్రోలర్స్ కి బదులిస్తుందో చూడాలి.