English | Telugu
'ఢీ' నుంచి సుధీర్‌ని తప్పించారా? తనే తప్పుకున్నాడా?
Updated : Feb 22, 2022
సుడిగాలి సుధీర్ `జబర్దస్త్`, 'ఎక్స్ ట్రా జబర్దస్త్', దేవి డ్రామా కంపెనీకామెడీ షోలతో నిత్యం బిజీగా వుంటున్నాడు. సుధీర్ కు బుల్లితెరపై వున్న క్రేజ్, డిమాండ్ అందరికి తెలిసిందే. `జబర్దస్త్` కామెడీ షోతో సుధీర్ ఏకంగా సెలబ్రిటీగా మారిపోయాడు. అతనికి, రష్మీ గౌతమ్ కి మధ్య వుండే కెమిస్ట్రీ ఇద్దరినీ పాపులర్ అయ్యేలా చేసింది. వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోంది అనేంతగా వీరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ కావడంతో `జబర్దస్త్` వారు కూడా వీరిని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు.
Also Read:సుడిగాలి సుధీర్ ఇంట్లో రోజూ నాలుగు షోలు.. ఏమాకథ?
బుల్లితెరపై వచ్చిన క్రేజ్‌తో సుడిగాలి సుధీర్ సినీ హీరోగానూ మారిన విషయం తెలిసిందే. హీరోగా సినిమాలు చేస్తున్నా `జబర్దస్త్` ని మాత్రం తను వీడటం లేదు. ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే వున్నాడు. త్వరలో సుడిగాలి సుధీర్ `గాలోడు` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇదిలా వుంటే తను 'ఢీ' షోని ఎందుకు వీడాల్సి వచ్చిందో వివరించాడు సుధీర్. తనని తప్పించారంటూ జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొంత మంది మాత్రం 'ఢీ' షో నుంచి సుధీర్ తానే తప్పుకున్నాడని ప్రచారం చేశారు. `ఢీ`షో నుంచి సుధీర్ వెళ్లిపోవడం ఆ షోకు బిగ్ మైనస్ గా మారింది.
Also Read:రెండో పెళ్లి చేసుకున్న బాలీవుడ్ స్టార్ యాక్టర్
అయితే తాజాగా `జబర్దస్త్` ప్రోమోలో 'ఢీ' నుంచి తాను ఎందుకు బయటికి రావాల్సి వచ్చిందో వెల్లడించాడు. డేట్స్ సమస్య కారణంగానే తాను `ఢీ` షో నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు. 'కాలింగ్ సహస్ర', 'గాలోడు' వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు సుడిగాలి సుధీర్. ఈ రెండు చిత్రాల్లో నటిస్తూనే `జబర్దస్త్`, 'శ్రీదేవి డ్రామా కంపనీ' షోల్లో స్కిట్ లు చేస్తున్నాడు. దీంతో డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో తాను 'ఢీ' షో నుంచి బయటికి వచ్చేశానని క్లారిటీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.