పునీత్ కుటుంబంలో మరో విషాదం
on Feb 21, 2022

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్ లో గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ బాధ నుంచి ఆయన కుటుంబంసభ్యులు ఇంకా కోలుకోకముందే వారి కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. తాజాగా పునీత్ మామగారు కన్నుమూశారు.
పునీత్ భార్య అశ్విని తండ్రి భగ్మనే రేవనాథ్(78) ఆదివారం నాడు గుండెపోటుతో మరణించారు. పునీత్ మరణంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆయన ఒత్తిడికి లోనైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం రేవనాథ్ కు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆయనను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఇప్పటికే భర్త పోయిన బాధలో ఉన్న అశ్విని.. తండ్రి మరణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



