English | Telugu

ఏంటీ సాగదీత... 'కార్తీక దీపం' ముందుకు కదలట్లేదుగా!

'కార్తీక దీపం' సీరియ‌ల్‌కు తిరుగులేదు. వీక్ష‌కాద‌ర‌ణ‌లో బుల్లితెర‌పై దాన్ని మించినది లేదు. అందులో ఎటువంటి సందేహాలు అవ‌స‌రం లేదు. సీరియ‌ల్‌కు వ‌స్తున్న టీఆర్పీ రేటింగ్‌లు చూస్తే ఆ సంగ‌తి తెలుస్తుంది. అయితే, గత కొన్ని రోజులుగా సీరియల్‌ను సాగదీస్తున్న ఫీలింగ్ కొంతమందికి కలుగుతోంది. మోనిత జైలుకు వెళ్లినప్పటి నుండి కథ పెద్దగా ముందుకు కదల్లేదు.

మోనిత జైలుకు వెళ్లిన తర్వాత కార్తీక్, దీప ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారని ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్‌ చేశారు. జైలు నుండి మాయలేడి కొత్త పన్నాగాలు పన్నుతుండంతో ఏం చేస్తుందోననే క్యూరియాసిటీ కలిగింది. దానికి తగ్గట్టుగా కథనం, సన్నివేశాలు లేవని కొందరు కామెంట్ చేస్తున్నారు. కార్తీక్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని మోనిత తన కథను పేపర్‌లో వేయించింది. అక్కడి నుండి అది పిల్లలకు ఎక్కడ తెలుస్తుందోనని కార్తీక్, దీప, సౌందర్య కంగారు పడటం... ఎమోషనల్ సీన్లు చూపించడం మినహా పెద్దగా కథ ముందుకు కదలడం లేదు.

హార్ట్ ఎటాక్ అని జైలు నుండి నాటకం ఆడిన మోనిత, బయటకు రావడం ఆడియ‌న్స్‌కు షాక్‌, స‌ర్‌ప్రైజ్ వంటివి ఇవ్వలేదు. గతంలో చచ్చినట్టు నాటకం ఆడి, మారువేషంలో కార్తీక్ చుట్టూ తిరిగిన మోనిత... హార్ట్ ఎటాక్ వచ్చినట్టు నటించి కార్తీక్ ఆస్పత్రికి రావడం పెద్ద విశేషమా? వచ్చిన తర్వాత కూడా కార్తీక్ పిల్లల దగ్గర తండ్రిని దోషి కింద ప్రాజెక్ట్ చేసింది. దాంతో పిల్లలు మళ్లీ ఏడవడం, తండ్రికి దూరంగా ఉండటం, నానమ్మ సౌందర్య వాళ్లకు నచ్చజెప్పాలని చూడటం... సేమ్ సీన్లు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నట్టు ఉన్నాయని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా... సీరియల్ రేటింగ్ మాత్రం టాప్ లో ఉండటం గమనార్హం.