English | Telugu

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పోంగ.. గంగవ్వ ఏం చేసిందంటే!

ప్రస్తుతం తెలంగాణాలో సమ్మక్క సారలమ్మ జాతర సాగుతోంది. ఈ జాతరకి ఎక్కడెక్కడినుండో జనాలు వస్తుంటారు. వచ్చి ఆ దేవతలకి బంగారం( బెల్లం ) సమర్పించి వారి మొక్కులు తీర్చుకుంటారు. అయితే అమ్మవారికి ఇచ్చే మొక్కులు ప్రతీ కుటుంబానికి తరతరాలుగా వస్తున్న ఆచారమని చెప్తున్నారు మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ.

సోషల్ మీడియాలో మై విలేజ్ షో అనిల్ జీల అండ్ టీమ్ హవా నడుస్తుంది. యూట్యూబర్ గా అనిల్ జీల, గంగవ్వ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణాలోని ఒక మారుమూల గ్రామంలో ఉన్న గంగవ్వని పాపులర్ చేసాడు అనిల్ జీల. మై విలేజ్ షో ద్వారా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ కొంతమందితో కలిసి చిన్న చిన్న వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పాపులర్ అయ్యాడు. అనిల్ జీల క్రియేట్ చేసిన 'మై విలేజ్ షో' యూట్యూబ్ ఛానెల్ ద్వారా గంగవ్వకి బిగ్ బాస్ షోలో అవకాశం లభించింది. షోలోకి వెళ్ళాక నాగార్జున సైతం తనకి ప్రోత్సాహం అందించాడు. గంగవ్వ కొత్తగా " విలేజ్ షో - మిక్స్ " అనే యూట్యూబ్ ఛానెల్ ని మొదలెట్టింది. ఇందులో రకరకాల వ్లాగ్స్ అప్లోడ్ చేయగా అవి అత్యధిక వీక్షకాధరణ పొందుతున్నాయి.

ఈ యూట్యూబ్ ఛానెల్ లో ' మేడారం జాతర పోంగ ' అనే వ్లాగ్ ని అప్లోడ్ చేశారు. ఇందులో గంగవ్వ, అంజి మామా, చందు, కన్నయ్య ఇంకా కొంతమంది కలిసి మేడారం జాతరకి ఎడ్లబండి కట్టుకొని వెళ్తుంటారు. అయితే వాళ్ళు వెళ్ళేదారిలో ఒక దగ్గర ఆగి సేద తీరుతుంటారు. అయితే అలా ఆగి మాట్లాడుకుంటుండగా కన్నయ్య తప్పిపోతాడు. ఎంత వెతికినా దొరకడు కాసేపటికి ఆ కన్నయ్య వచ్చి నాకు పులి ఎదురైందని దానిని చూసి భయమేసిందని , కానీ అది నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందని చెప్పగా అందరు ఆశ్చర్యపోయారు. ఇక అందరు అది సమ్మక్క సారక్కల మహిమే అని అనుకున్నారు. సమ్మక్క సారక్కలకి మొక్కుతూ హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళారు.‌ అయితే ఇప్పుడు ఈ జాతరకి కొన్ని లక్షల మంది వివిధ ప్రాంతాల నుండి తరలి వెళ్తారు. ఈ వీకెండ్ వరకు సాగే ఈ జాతర తెలంగాణలోని ముఖ్యమైన జాతరగా భావిస్తారు.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.