English | Telugu

మొసళ్లతో ఆడుకుంటున్న హిమజ!

హిమజ.. అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై సందడి చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చాలా సినిమాలలో హీరోయిన్ కి ఫ్రెండ్ పాత్రలలో‌ నటించిన హిమజ..‌ మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. విజయవాడలో పుట్టిన హిమజ.. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో సినిమారంగంలోకి వచ్చింది. బిగ్ బాస్-3 లోకి ఒక కంటెస్టెంట్ గా వెళ్ళిన హిమజ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు రావడంతో తను ఒక సెలబ్రిటీగా మారిపోయింది.

హిమజ వాళ్ళ నాన్న చంద్రశేఖర్ రెడ్డి సినిమాలకి మాటలు, పాటలు రాసేవాడు. అలా తను మాటలు, పాటలు రాసిన 'సర్వాంతర్యామి' అనే టెలీఫిల్మ్ లో తొలిసారి నటించింది హిమజ. ఆ తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ లో‌ నటించింది. ఆ తర్వాత బుల్లితెరపై అడపాదడపా సీరియల్స్ లో నటించిన హిమజ.. హీరో రామ్, హీరోయిన్ రాశిఖన్నా నటించిన 'శివమ్' చిత్రంలో హీరోయిన్ కి స్నేహితురాలి పాత్రలో తొలిసారిగా వెండితెరకు కనిపించింది. ఆ తర్వాత నేను శైలజ, చందమామ రావే, జనతా గ్యారేజ్, ధృవ, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలలో చేసింది.

అయితే ఇప్పుడు సినిమాలలో బిజీగా ఉంటోంది హిమజ. తనకి ఖాళీ సమయం దొరికినప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్, పోస్ట్ లు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. నిన్న మొన్నటిదాకా విదేశాలలో ట్రావెల్ చేసి వచ్చి‌న హిమజ .. మూడు నెలల క్రితం పులులతో ఆడుకోవచ్చు అనే వ్లాగ్ చేయగా దానికి అత్యధిక వ్యూస్ వచ్చాయి. తన హోమ్ టూర్ కి ముప్పై నాలుగు లక్షల వ్యూస్ వచ్చాయంటే తను ఎంత క్రేజ్ సంపాదించుకుందో తెలుస్తుంది. ఇప్పుడు మరొక వ్లాగ్ తో వచ్చింది. నీళ్లలోని మొసళ్లతో ఆడుకుంటూ కనిపించింది. బ్యాంకాక్ లోని ' ది మిలియనీర్స్ స్టోన్ పార్క్ అండ్ క్రోకోడైల్స్ పార్క్' లోకి హిమజ వెళ్ళింది. అక్కడ మొసళ్ళకి ట్రెయినింగ్ ఇస్తుంటారంటూ చూపించింది హిమజ. ఇదంతా చూసి ఆశ్చర్యపోయింది. కాగా తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసిన ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.