English | Telugu
సైకిల్ రేస్ లో పది లక్షలు గెలిచిన నయని
Updated : Jun 16, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `త్రినయని`. కన్నడ నటీనటులు అషికా గోపాల్, చందూ గౌడ ప్రధాన జంటగా నటించగా, ఇతర పాత్రల్లో పవిత్ర జయరామ్, నిహారిక హర్షు, ప్రియాంక చౌదరి, శ్రీసత్య, భావనా రెడ్డి, చల్లా చందు, అనిల్ చౌదరి సురేష్ చంద్ర నటించారు. జరగబోయేది ముందే తెలిసే వరం వున్న ఓ పల్లెటూరి యువతి కథగా ఈ సీరియల్ ని రూపొందించారు. తన భర్త తల్లి హత్య వెనక దాగివున్న అసలు రహస్యాన్ని తెలుసుకునే క్రమంలో ఆ యువతి ఎలాంటి సంఘటనల్ని ఎదుర్కొంది?.. చివరికి ఎలా కథ సుఖాంతమైంది అన్నదే ఈ సీరియల్ ప్రధాన కథ.
గురువారం ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో తెలుసుకుందాం. సైకిల్ రేస్ లో గెలుపొందిన వారికి రూ. 10 లక్షల బహుమతి అని తెలియడంతో నయని పోటీకి సిద్ధమవుతుంది. ఆమెకు పోటీగా కసి రంగంలోకి దిగుతుంది. నయని చెల్లెలు సత్య, తోడి కోడలు హాసిని, విశాల్ మేనత్త దురంధర కూడా పోటీకి దిగడంతో అంతా కలిసి సైకిల్ రేస్ లో పాల్గొంటారు. మధ్యలో కసి, వల్లభ ఏర్పాటు చేసిన రౌడీలు నయని స్పీడుకి కళ్లెం వేయలని ప్లాన్ చేసి తనని దారి మళ్లిస్తారు.
దారి తప్పిన నయనికి అక్కడ రౌడీలు ఎదురుపడతారు. దీంతో ఏం జరుగబోతోందో గ్రహించిన నయని రౌడీలు తనపై దాడికి ప్రయత్నించే సమయంలో వాళ్ల కళ్లల్లో పసుపు, కుంకుమ చల్లి చాకచక్యంగా తప్పించుకుంటుంది. మళ్ళీ పోటీలో పాల్గొంటుంది. నయని వస్తున్న విషయం గమనించి కసి ఇద్దరు పోటీదారులని నయనికి అడ్డుతగిలి పడేలా చేస్తుంది. అయితే అది గమనించిన హాసిని.. నయనికి అండగా నిలబడుతుంది.
ఆ తరువాత హాసిని నాకు సైకిల్ తొక్కే ఓపిక లేదని చెప్పడంతో తనని సైకిల్ పై ఎక్కించుకుని నయని ముందుకు సాగుతుంది. తన ముందున్న వారిని దాటి కసిని చేరుకుంటుంది. ఫైనల్ గా కసిని కూడా దాటి పోటీలో విజేతగా నిలుస్తుంది. అయితే ప్రైజ్ మనీగా వచ్చిన రూ. 10 లక్షలను గుండె ఆపరేషన్ కోసం ఎదురుచూస్తున్నఓ చిన్నారి కుటుంబానికి ఇచ్చేసి తన గొప్ప మనసు చాటుకుంటుంది. ఆ తరువాత ఏం జరిగింది?.. ప్లాన్ ఫెయిలైనందుకు కసి, వల్లభలపై తిలోత్తమ ఎలా రియాక్ట్ అయింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.