English | Telugu
ఆ ఇద్దరికి హౌస్ లో వుండే అర్హత లేదంటోంది
Updated : May 2, 2022
బిగ్‌బాస్ నాన్ స్టాప్ ఓటీటీ వెర్షన్ మొత్తానికి ఎండింగ్ కి వచ్చేసింది. గత కొన్ని వారాలుగా వివాదాలు..గొడవలు, ఇంటి సభ్యుల మధ్య గొవలతో రచ్చ రచ్చగా సాగుతున్నా బిగ్ బాస్ ఫస్ట్ ఓటీటీ వెర్షన్ అనుకన్నట్టుగానే మిశ్రమ స్పందనని సొంతం చేసుకుంటూ చివరికి ఎండ్ కి వచ్చేసింది. ఈ వారం ఎలిమినేషన్ లో అనూహ్యంగా హమీదా బయటికి వచ్చేసిన విషయం తెలిసిందే. అజయ్ వస్తాడని ఊహిస్తే అనూహ్యంగా హమీదాని హౌప్ నుంచి ఎలిమినేట్ చేసేశారు. దీంతో హమీదా బయటికి రావాల్సి వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 5 లో హమీదా కేవలం ఐదు వారాలే వుంది.
కానీ బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ వెర్షన్ లో మాత్రం పది వారాలు కొనసాగడం విశేషం. తాజాగా హౌస్ నుంచి బయటికి వచ్చిన హమీదా ఇద్దరు కంటెస్టెంట్ లకు హౌస్ లో వుండే అర్హత లేదని కామెంట్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. యాంకర్ రవి హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ నాన్ స్టాప్ బజ్ లో పాల్గొన్న హమీదా తాజా వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా రవి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన హమీదా ఎక్కడా తగ్గలేదని చెప్పుకొచ్చింది. అంటే పది వారాలు ఇక్కడ, ఐదు వారాలు అక్కడ.. ఆ ఇంపాక్ట్ ఇక్కడ రాలేదు. అన్నాడు రవి.
నేను అక్కడ ఎలా ఆడానో ఇక్కడా అలాగే ఆడాను అని చెన్నుకొచ్చింది హమీదా. ఇక నీకంటే అర్హతలేని వాళ్లు ఇంకా హౌస్ లో వున్నారని అనుకుంటున్నావా? అని రవి అడిగితే `అరియానా, అషురెడ్డి అని టక్కున చెప్పి షాకిచ్చింది. హౌస్ లో వుంటూ ఈ వీక్ అఖిల్ ని నామినేట్ చేయాలనుకున్నాను అంటూ అతని ఫొటోని చించేసింది హమీదా. మిత్రా నవ్వు రియలా? ఫేకా అన్నది తెలియదు. ఇక నటరాజ్ మాస్టర్ గురించి మాట్లాడుతూ వేరే వాళ్ల పర్సనాలిటీ మీద అతను కామెంట్స్ చేయడం నచ్చలేదని ఫొటో చించేసింది. ఇక ఇందులో శివ టాప్ 5 లో వుంటాడని చెప్పేసింది. తను ఎంటర్ టైన్ చేస్తే అది వేరే లెవెల్ అంటూ చెప్పడంతో రవి అదే మాటని రిపీట్ చేశాడు.