English | Telugu
సీరియల్ బ్యాచ్ గ్రూపిజాన్ని బయటపెట్టిన నాగార్జున!
Updated : Oct 29, 2023
ఇప్పటికీ బిగ్ బాస్ ఆరు సీజన్లు పూర్తి చేసుకోగా ఏ కంటెస్టెంట్ కూడా ఏడు వారాలు నామినేషన్లో లేకుండా లేడు. కానీ ఈ సీజన్-7 లో ఆట సందీప్ ఇప్పటివరకు నామినేషన్లో లేడు. ఎనిమిదవ వారం నామినేషన్లోకి వచ్చాడు. అయితే నాగార్జున శనివారం ఎపిసోడ్ లో సీరియల్ బ్యాచ్ ఆగడాలని ప్రేక్షకులకి బిగ్ స్క్రీన్ మీద చూపించాడు.
ఇద్దరు లేదా ముగ్గురు కలిసి రేయ్ నువ్వు ఇతన్ని నామినేట్ చేయు, రేయ్ నువ్వు అతడిని నామినేట్ చేయు అని ముందే మాట్లాడుకొని నామినేట్ చేస్తే అది గ్రూపిజం సర్. కానీ మేము ఫ్రెండ్స్ అని టేస్టీ తేజ రెండవ వారం నామినేషన్లో చెప్పినది వేసి చూపించిన నాగార్జున.. కొన్ని వారాల తర్వాత అని మరొక వీడియో చూపించాడు. అందులో ఏముందంటే.. రేయ్ నువ్వు పెద్దాయని(శివాజీ) ని చూసుకో, మేం మిగిలిన ఇద్దరిని నామినేషన్లో పెడతాంలే అని టేస్టీ తేజ శోభాశెట్టితో అనేది చూపించాడు నాగార్జున. అక్కడ ప్రియాంక జైన్ పాములాగా స్టెప్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తుంది కూడా చూపించాడు నాగార్జున. ఇక నాగార్జున ప్రియాంకని లేపి.. అమర్ దీప్ పగిలిపోద్ది అని బిగ్ బాస్ ప్రాపర్టీని తంతే నీ బ్లడ్ బాయిల్ అవ్వలేదా అని అడిగాడు. నేను తర్వాత చెప్పాను సర్ అని ప్రియంక అంది. ఆ రోజు బోలే-శోభాల నామినేషన్లో మధ్యలోనే ఆపి చెప్పావ్ కదా, మరి అమర్ దీప్ తప్పు మాట్లాడితే చెప్పలేదు ఎందుకని నాగార్జున నిలదీశాడు.
మొన్నటి సింక్ అండ్ ఫ్లోట్ టాస్క్ లో గ్రూప్ గా ఆడిరది చూపించిన నాగార్జున.. ఇలా ఆడటం తప్పు అని ప్రియాంక, శోభాశెట్టి, అమర్ దీప్ లకి నాగార్జున చెప్పాడు. పల్లవి ప్రశాంత్ ని ఏరా కొడకా అని అన్నావ్ కదా అమర్.. మరి ఆట సందీప్, అంబటి అర్జున్ లని ఎప్పుడైనా అన్నావా? అని నాగార్జున అడుగగా.. లేదు సర్ అని అమర్ దీప్ అన్నాడు. మరి ఇతడినే ఎందుకు అన్నావ్? పల్లవి ప్రశాంత్ అంటే చిన్నచూపా అని ఏకిపారేశాడు నాగార్జున. ఇలా సీరియల్ బ్యాచ్ అందరికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. ఇక హౌస్ లో ఎవరు బూతులు మాట్లాడినా సహించేది లేదంటూ కంటెస్టెంట్స్ అందరికి నాగార్జున వార్నింగ్ ఇచ్చాడు.