Read more!

English | Telugu

బొంగు బూతు కాదా సందీప్‌.. ఏకి పారేసిన నాగార్జున!

బిగ్‌బాస్‌ హౌస్‌లో నాగార్జున హోస్టింగ్‌ ఈ సీజన్‌లో అదిరిపోయింది. ఒక్కొక్కరి తప్పొప్పులు చూపిస్తూ నాగార్జున ఏకి పారేశాడు. ఆట సందీప్‌, శోభాశెట్టి, అమర్‌ దీప్‌ , ప్రియాంక జైన్‌లకి గట్టిగా క్లాస్‌ పీకాడు.

సింక్‌ అండ్‌ ఫ్లోట్‌ టాస్క్‌లో ప్రియాంక జైన్‌, శోభాశెట్టిలకి అమర్‌ దీప్‌ ఇచ్చిన క్లూలని వాళ్ళు హింట్‌ ఇచ్చింది బిగ్‌ స్క్రీన్‌ మీద వేసి చూపించాడు నాగార్జున. ఇక అంబటి అర్జున్‌ని నువ్వు కెప్టెన్‌ కదా, నువ్వే చూసుకోవాలి కదా అని నాగార్జున అనగా.. ఎవరో హింట్‌ ఇచ్చినట్టు అనిపించింది సర్‌ అదే క్లారిటీ లేదు క్లారిఫై చేసుకోమని సంచాలకుడిగా ఉన్న గౌతమ్‌తో చెప్పానని అర్జున్‌ అన్నాడు. ఇక ఆట సందీప్‌ని లేపి.. ఇప్పుడు మనం బొంగులో డ్యాన్స్‌ మాస్టర్‌ గురించి మాట్లాడదామని నాగార్జున అన్నాడు. సందీప్‌ నువ్వు డ్యాన్స్‌ షోలో పాల్గొన్నావ్‌ కదా? నువ్వు డ్యాన్సరా? లేక కొరియోగ్రాఫరా? అని నాగార్జున అడగ్గా.. రెండూ సర్‌ అని సందీప్‌ అన్నాడు. ఈ బొంగులో సమాధానం నాకొద్దని నాగార్జున అన్నాడు.  డ్యాన్స్‌ చేశానని సందీప్‌ అన్నాడు. మరి అతను నిన్ను డ్యాన్సర్‌వి అని అంటే నువ్వు ఎందుకు బొంగు అని అన్నావ్‌. మరెందుకు ఆ బొంగులో అటిట్యూడ్‌..  బొంగు అంటే తప్పు పదం కాదు కదా అందుకే వాడుతున్నాని నాగార్జున అన్నాడు.

బొంగు అనేది తప్పు పదమా కాదా అని హౌస్‌లోని వాళ్లని అడిగాడు నాగార్జున. అందరూ తప్పని చెప్పటంతో సారీ సర్‌ నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు.. ఆ హీట్‌ ఆఫ్‌ ది మూమెంట్‌ అలా వచ్చిందని, ఇకనుండి రిపీట్‌ కాకుండా చూసుకుంటానని ఆట సందీప్‌ అన్నాడు. ఇక మిగిలిన కంటెస్టెంట్స్‌కి కూడా గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చాడు నాగార్జున.