English | Telugu

బ్రెయిన్ వాడు లోబో... క్లాస్ పీకిన నాగార్జున!

బిగ్‌బాస్ శ‌నివారం ఇంట్లో స‌భ్యులు అంద‌రికీ 'బిగ్ బాస్ యాప్ స్టార్' టాస్క్ ఇచ్చారు. ఇందులో ఏం చేయాలంటే... ఇంట్లో ఎవరు 'అటెన్షన్ సీకర్'? ఎవరు నోరు అదుపులో పెట్టుకోవాలి ('వాచ్ యువర్ టంగ్')? ఎవరు బ్రెయిన్ వాడాలి ('యూజ్ యువర్ బ్రెయిన్')? ఎవరు సింపతీ గైనర్? అనేది చెప్పాలి.

శ్రీరామచంద్ర, సిరి హనుమంతు, షణ్ముఖ్ జస్వంత్, విశ్వ... హౌస్‌లో నలుగురు లోబోకి బ్రెయిన్ వాడమని చెప్పారు. లోబో సింపతీ గైనర్ అనిఆర్జే కాజల్ చెప్పింది. ప్రియాతో పాటు ప్రియాంక కూడా లోబో నోరు అదుపులో పెట్టుకోవాలని అభిప్రాయపడ్డారు. శ్వేతా వర్మ అయితే తన దృష్టిలో లోబో వరస్ట్ పెరఫార్మర్ అని డిసైడ్ చేసింది. చాలాసార్లు రూల్స్ బ్రేక్ చేశాడని చెప్పింది.

లాస్ట్ వీక్ హౌస్‌లో లోబో ఓవర్ యాక్షన్ చేశాడు. తన ప్రేమకథను సినిమా కథలా ఉందని చెప్పినందుకు ప్రియా మీద అరిచాడు. నిజం చెప్పాలంటే... అంత అరవాల్సిన అవసరం లేదని అనిపించింది. తర్వాత ప్రియాకు లోబో సారీ చెప్పినా సరే. అతడు చేసినది తప్పే. అందుకని నాగార్జున శనివారం లోబోకి క్లాస్ పీకారు. 'మాట్లాడితే బస్తీ నుండి వచ్చాను (అంటావ్). ఇది బిగ్ బాస్. బస్తీ కాదు, విల్లా కాదు. ఇక్కడ అందరూ ఒక్కటే' అని లోబోకి నాగార్జున క్లాస్ పీకారు. అంతకు ముందు 'నీ ఒక్కడికే ఉంది ప్రేమ. ఇంకెవరికీ లేదు' అని కూడా అన్నారు. దాంతో ప్రియా కాస్త హ్యాపీ ఫీల్ అయ్యిందని చెప్పాలి. అంతే కాదు... లోబో తనను ఉరిమి ఉరిమి చూస్తున్నాడని కంప్లైంట్ ఇచ్చింది.