English | Telugu
బిగ్ బాస్ హౌస్ లో మెంటల్ స్ట్రెస్.. అందుకే వెయిట్ లాస్!
Updated : Nov 20, 2022
బిగ్ బాస్ సీజన్ 6లో వాసంతి అందగత్తె. ఈమెను చూసే కొద్దీ చూడ బుద్దేస్తుంది. హోస్ట్ నాగార్జున కూడా గ్లామర్ డాల్ అనే స్టాంప్ వేశారు. ఈ షోకి రాక ముందు వాసంతి ఎవరికీ తెలీదు. ఇప్పుడు ఆడియన్స్ కి ఒక బ్యూటీ క్వీన్ గా అందరికీ తెలుసు. దీంతో ఈమెకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
బిగ్ బాస్ హౌస్ లో తనతో ఎవరూ సరిగా కనెక్ట్ అవలేదు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. వాసంతి ఈజ్ సింగల్ ఇన్ బిగ్ బాస్ అని అంది. బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చాక ఎంతో మంది పాపులర్ అయ్యారు. ఇక ఇప్పుడు వాసంతి కూడా అలాగే పాపులర్ అయ్యింది. అందంగా ఉండడమే కాదు మిగతా కంటెస్టెంట్స్ కి గట్టి పోటీ కూడా ఇచ్చింది. ఐతే హౌస్ లోకి వెళ్లే ముందు వాసంతి పిక్స్ ని హౌస్ నుంచి బయటికి వచ్చాక వున్న వాసంతి పిక్స్ ని చూస్తే ఇంత సన్నగా ఐపోయింది ఏమిటా అనిపిస్తుంది. ఇక ఇలా ఎందుకు అయ్యిందో బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగిందో దానికి సంబందించిన కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది.
"బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5లో ఉండకపోయినా ఆ తర్వాత స్థానంలో అయినా ఉంటానని ఆశ పడ్డాను కానీ అలా జరగలేదు. సూర్య, గీతూ ఎలిమినేట్ అయిన దగ్గర నుంచి మాలో టెన్షన్ మొదలైంది. దాంతో ఎప్పుడు ఎవరూ ఎలిమినేట్ అవుతారో హౌస్ నుంచి వెళ్ళిపోతారో తెలియక టెన్షన్ పడేవాళ్ళం. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక 6 కేజీలు తగ్గాను. అక్కడ అందరికీ సరిపడినంత ఫుడ్ ఉంటుంది. కానీ మెంటల్ స్ట్రెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మెంటల్ స్ట్రెస్ ఉంటే తిన్నది సరిగ్గా ఒంటబట్టదు. కాబట్టి హౌస్ లోకి వచ్చిన చాలామంది కూడా వెయిట్ లాస్ అయ్యారు." అని చెప్పుకొచ్చింది.