English | Telugu
హైపర్ ఆది ఇంట్లో మర్డర్
Updated : May 31, 2022
అనుకోకుండా హైపర్ ఆది ఇంట్లో మర్డర్ జరిగేసరికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వచ్చి అతన్ని అతని భార్యని ఎంక్వయిరీ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అడివి శేష్ వస్తారు. ఆదిని హోస్ట్ ప్రదీప్ ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అసలు మర్డర్ ఎలా జరిగింది ? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఆదిని కన్ఫ్యూస్ చేస్తూ ఉంటారు. ఆది ఆన్సర్ తప్పు చెప్తే చాలు చేతికి, కాలికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. నీ ఫోన్ లో ఎక్కువగా లేడీస్ నంబర్స్ ఉన్నాయి కదా ? అని అడివి శేష్ అడిగేసరికి అలాంటివేమి ఉండవ్ అని చెప్తాడు ఆది. వెంటనే షాక్ తగులుతుంది ఆదికి. దాంతో ఒక్కసారిగా కెవ్వు మంటాడు.
ఇంతకు ఎంతమంది అమ్మాయిల నంబర్లు ఉన్నాయో చెప్పు అంటూ జానీ మాస్టర్ అడిగేసరి 2 , 6 అంటూ తప్పులు చెప్తుంటాడు ఆది. నీ వయసెంత అనే ప్రశ్నకు 16 అంటూ తప్పు చెప్పేసరికి మళ్ళీ షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ తర్వాత ఆది వైఫ్ ని కూడా ఇంటరాగేట్ చేస్తారు ఆఫీసర్స్. తర్వాత ఆర్మీ యూనిఫామ్ లో ఉన్న ఒక టీం నా పేరు సూర్య.. నా ఇల్లే ఇండియా అనే మూవీలో ఓ సైనిక అనే పాటతో దుమ్ము రేపుతుంది. ఇక ఈ హైలెట్స్ అన్నిటిని కూడా జూన్ 1 న ప్రసారం కాబోయే ఢీ షోలో చూడొచ్చు.