English | Telugu

త్వరలో కొత్త సీరియల్ "ముక్కుపుడక"

జీ తెలుగు ఛానెల్ లో త్వరలో ముక్కుపుడక అనే సీరియల్ ప్రసారం కాబోతోంది. ఇందులో ఐశ్వర్య పిస్సే నటిస్తోంది. ఈమె అగ్నిసాక్షి, కస్తూరి సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. బేసిక్ గా ఈమె కన్నడ నటి ఐనప్పటికీ తెలుగులోనూ నటిస్తూ అటు కన్నడలో, ఇటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. సర్వమంగళ మాంగళ్య అనే సీరియల్ తో కన్నడ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అగ్ని సాక్షి సీరియల్ తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఐష్. ఐతే మరో సీరియల్ ఆక్టర్ నవ్య స్వామి వాళ్ళ అన్నయ్యని ఐశ్వర్య ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఇక ఇప్పుడు ఆమె నటించిన కొత్త సీరియల్ ముక్కుపుడక త్వరలో ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆ సీరియల్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఐశ్వర్య అవని అనే పాత్రలో నటిస్తోంది. ఈమె ఇందులో ఒక టూరిస్ట్ గైడ్ గా డిఫరెంట్ రోల్ లో నటిస్తోంది. ఐశ్వర్యకు జోడీగా రాకేష్ యాక్ట్ చేస్తున్నారు. అతనికి తెలుగులో ఇదే ఫస్ట్ సీరియల్. ఐతే హీరో రాకేష్ అవనితో ప్రేమలో పడతాడు. ఐతే అవనికి ఒక చెడ్డ బావ కూడా ఉంటాడు. ఆమె జీతాన్ని దోచుకు తింటూ ఉంటాడు.

మరో పక్క హీరో తల్లి అన్నపూర్ణ దేవి భక్తురాలు. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదం తయారీ రహస్యం తెలుసుకుని ఆ ఊరిని సస్యశ్యామలం చేసి ముందుకు నడిపే కోడలు ఎవరు అంటూ ఆ తల్లిని అడుగుతూ ప్రార్థిస్తుంది. అమ్మవారి ముక్కుపుడకకు హీరో ఫామిలీ నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ఇంతకు ఆ ఇంటికి అవని కోడలిగా వెళ్లబోతోందా ? అత్తగారి నమ్మకాన్ని ఆమె నిలబడుతుందా..? మహాప్రసాదం తయారీ రహస్యాన్ని తెలుసుకుంటుందా ? ఈ విషయాలన్నీ తెలియాలంటే ముక్కుపుడక సీరియల్ కోసం మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.