English | Telugu
ఇంటర్నెట్ లేని అడవిలో ప్రకృతితో కనెక్ట్ అయిన హీరో!
Updated : Sep 23, 2022
ముఖేష్ గౌడ అంటే ఇప్పుడిప్పుడే తెలుస్తోంది ఆడియన్స్‌కు. కానీ రిషి సర్ అంటే అందరికీ తెలిసిపోతుంది. 'గుప్పెడంత మనసు' సీరియల్ లో రిషి గెటప్ కానీ, ఆటిట్యూడ్ కానీ, వసుధారతో ప్రేమ కానీ.. అన్ని కూడా ఆడియన్స్ కు ఎంతో నచ్చుతున్నాయి. దాంతో ఈ షోని ఆడియన్స్ బాగా ఫాలో అవుతున్నారు. ఇక ముఖేష్ సహజ నటన కూడా అందరినీ ఆకట్టుకుంటోంది.
రిషికి ప్రకృతి అన్నా, మూగ జీవాలన్నా చాలా ఇష్టం. ఇటీవల గుర్రం ఎక్కి సముద్రం ఒడ్డున రైడ్ చేశాడు. లేటెస్ట్‌గా ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు ముఖేష్ గౌడ. "అడవిలో ఇంటర్నెట్ లేదు, కానీ మీకు ఈ ప్రకృతితో మాత్రం మంచి కనెక్షన్ దొరుకుతుంది అని నేను ప్రామిస్ చేస్తున్నా" అంటూ ఒక కాప్షన్ పెట్టాడు.
ఈ పిక్స్ చూసి నెటిజన్స్ ఆనందపడుతున్నారు. "సూపర్బ్ లొకేషన్, మిస్టర్ హ్యాండ్సమ్ ఆఫ్ మైసూర్.. ఏ యాంగిల్లో ఐనా మీరు సూపర్.. హ్యాండ్సమ్ నెస్ కి కేర్ ఆఫ్ అడ్రెస్" అంటూ రిషిని నెటిజన్స్ తెగ పొగిడేస్తూ రిప్లైస్ ఇస్తున్నారు.