English | Telugu

వ‌ర్ష‌పై ఇమ్ము బాడీ షేమింగ్!

బుల్లితెర మీద వర్ష, ఇమ్మానుయేల్ జోడి కొంచెం స్పెషల్. ఎందుకంటే సుధీర్-రష్మీ లవ్ ట్రాక్ తరువాత వీళ్ళ ప్రేమ బుల్లితెర మీద బాగా హైలైట్ అయ్యింది. ఇక స్కిట్స్ లో కూడా "అల్లుడొస్తున్నాడని చెప్పు మీ అమ్మకి" అని ఇమ్ము అంటే.. "కోడలొస్తోందని చెప్పు" అని వర్ష అనడం మనకు తెలుసు.అలాగే ఇద్దరూ ప్రపోజ్ చేసుకున్నారు కూడా.

ఈ మధ్య కాలంలో ప్రసారమవుతున్న స్కిట్స్ లో వీళ్ళ జోడీకి కొంచెం బ్రేక్ పడింది. ఇక వర్ష విషయంలో కమెడియన్స్ అంతా కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఆ కామెంట్స్ కి ఒక్కోసారి సీరియస్ అవుతుంది.. ఒక్కోసారి లైట్ తీసుకుంటుంది వర్ష. ఆమెను ఎక్కువగా బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారు స్కిట్స్ లో. కొంత కాలం క్రితమే తన బాడీ షేమింగ్ పై ఫైర్ అయ్యేసరికి అలా అనడం మానేశారు.

కానీ చాలా కాలం తర్వాత ఇప్పుడు 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో వర్షను మళ్ళీ అలాగే కామెంట్ చేశాడు ఇమ్మానుయేల్. "బంగారం అందరూ అడుగుతున్నారు" అని వర్ష ఒక కామెడీ డైలాగ్ చెప్పడానికి ట్రై చేస్తున్నంతలోనే, "ఏమని.. నువ్ ఆడా, మగా.. అనా?" అంటూ ఇమాన్యుయేల్ వర్ష పరువు తీసేశాడు. ఇక ఈ షోలో వర్ష మాత్రం ఏం మాట్లాడకుండా ఆ డైలాగ్ కి నవ్వి ఊరుకుంది.