English | Telugu

డాక్ట‌ర్ బాబు పోజ్‌.. ఫొటోగ్ర‌ఫీ బై వంట‌ల‌క్క‌!

'కార్తీక దీపం' బుల్లితెర మీద మస్త్ పాపులర్ డైలీ సీరియల్. ఈ సీరియల్ ద్వారా వంటలక్క, డాక్టర్ బాబు ఫుల్ ఫేమస్ అయ్యారు. వీళ్ళ అసలు పేర్లను మర్చిపోయి ఫాన్స్, ఆడియన్స్ అంతా క్యారెక్టర్ నేమ్స్ తో పిలుస్తూ ఉంటారు. ఇక 'కార్తీక దీపం' షూటింగ్ లో వాళ్ళు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. పాటలు పాడుకుంటారు, ఆట పట్టించుకుంటారు, డాన్స్ లు చేస్తారు. ఇలాంటివన్నీ రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నిరుపమ్ పరిటాల అలియాస్ డాక్టర్ బాబు ఫొటోని తీసింది వంటలక్క.

ఆ ఫోటోని డాక్టర్ బాబు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసి మంచి కవితా వాక్యాలు కూడా రాసారండోయ్.. "ఫ్లవర్స్ జడలో ఉంటే అందం.. గోడకి ఉంటే అలంకారం.. దేవుడి దగ్గర పెట్టి పెడతాం నమస్కారం.. మరి మన షర్ట్ మీద ఉంటే ఉత్సాహం..." అని క్యూట్ గా చెప్పాడు డాక్టర్ బాబు.. "ఫొటోగ్రఫీ బై వంటలక్క అండోయ్.. చెప్పకపోతే నెక్స్ట్ టైం ఫొటో తియ్యదు మళ్ళీ"... అంటూ ఫన్నీ లైన్స్ ని పోస్ట్ చేసాడు నిరుపమ్.

"మా వంటలక్క మంచి ఫోటో తీసింది.. క్యాప్షన్స్ అదిరిపోయాయి.. మేడం ఫొటోస్ తీస్తే ఇలాగే ఉంటుంది.. కార్తీకదీపంలో రీ ఎంట్రీ ఇచ్చాక మీరన్నీ పూల చొక్కాలే వేసుకుంటున్నారు.. మాట్లాడకుండా మీరు ఒక పోయెట్ ఐపోండి" అంటూ నిరుపమ్ ఫోటోకి కామెంట్స్ చేశారు నెటిజన్స్.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.