English | Telugu
కార్తీక దీపం: ఆదిత్యకు ఊహించని షాకిచ్చిన మోనిత
Updated : Nov 16, 2021
బుల్లితెర ప్రేక్షకుల్ని టీవీలకు అతుక్కుపోయేలా ఆకర్షిస్తున్న సీరియల్ `కార్తీక దీపం`. దేశ వ్యాప్తంగా టీఆర్పీ రేటింగ్ విషయంలో మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించిన ఈ సీరియల్ రోజు రోజుకీ రసవత్తర మలుపులు తిరుగుతూ కొంత మందిని ఆకట్టుకుంటూ మరి కొంత మందికి అసహనాన్ని కలిగిస్తోంది. ఈ మంగళవారం 1198 వ ఎపిసోడ్‌లోకి ఎంటరవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం పలు నాటకీయ పరిణామాలు.. ఆసక్తికర ట్విస్ట్‌లు చోటు చేసుకోబోతున్నాయి.
దీప తనకు తెలియకుండా తన చుట్టూ ఏదో జరుగుతోందని పసిగట్టి సౌందర్య, ఆనందరావు, డాక్టర్‌లబాబులపై ఇండైరెక్ట్‌గా సెటైర్‌లు వేయడం ప్రారంభిస్తుంది. రక రకాల వంటకాలన్నీ చేసి కోరి కోరి మరీ వడ్డిస్తూ సెటైర్లు వేస్తుంటుంది. ఇదతి గమనించిన ఆదిత్య `ఏంటీ వదినా ఈ రోజు చాలా ఆనందంగా కనిపిస్తున్నావ్? అంటాడు. దీంతో ఏమీ లేదు ఆదిత్య ఏడుస్తూ కనిపిస్తుంటే ప్రతీ ఒక్కరూ నన్ను ఏడిపించాలని చూస్తున్నారు.. అందుకే ఇలా నవ్వుతున్నానే అంటుంది.. దీంతో ఒక్కసారిగా సౌందర్య, ఆనందరావులు షాక్‌కు గురవుతారు.
కట్ చేస్తే ఆదిత్యని బుట్టలో వేయడానికి మోనిత మహత్తరమైన ప్లాన్ వేస్తుంది. డాక్టర్ బాబు వస్తున్నాడని చెప్పి ఆదిత్యని తన ఇంటికి రప్పిస్తుంది. తీరా ఇంటికి వచ్చిన ఆదిత్యకు అసలు విషయం చెప్పి మీ వాళ్లు నీదగ్గర చాలా దాచారని, నాకు బాబు పుట్టాడని, డెలివరీ సమయంలో మీ అన్నయ్య భర్తగా సంతకం చేశాడని.. డెలివరీ తరువాత మీ అమ్మే స్వయంగా తనని ఇంటికి తీసుకెళ్లిందని నమ్మడం లేదా అంటూ డాక్టర్ బాబుతో కలిసి పూజలో కూర్చున్న ఫొటోలని చూపిస్తుంది. ఆ ఫొటోలు చూసి ఆదిత్య షాక్‌కు గురవుతాడు. షాక్‌లోనే దీప అన్న మాటలు గుర్తు చేసుకుంటూ అన్న డాక్టర్ బాబుని నిలదీస్తానంటూ అక్కడి నుంచి బయటికి వస్తాడు. ఆదిత్య తన అన్న డాక్టర్ బాబుని నిలదీశాడా? ఇద్దరి మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? మంగళవారం కథ ఏ టర్న్ తీసుకోబోతోంది అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.