English | Telugu
`దేవత` : రాధకు ఊహించని షాకిచ్చిన సత్య
Updated : Nov 15, 2021
స్టార్ మాలో ప్రసారం అవుతున్న పాపులర్ సీరియల్ `దేవత`. అర్జున్ అంబటి, సుహాసిని, వైష్ణవి రామిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సీరియల్ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. పిల్లల కారణంగా ఆదిత్య అవమానానికి గురికావడంతో సత్య తట్టుకోలేకపోతుంది. ఆదిత్య సర్దిచెప్పినా సరే ఇంటికి వచ్చాక కూడా అదే మాధవ .. ఆదిత్యని అవమానించిన తీరుని జీర్ణించుకోలేక సత్య కోపంతో ఊగిపోతుంటుంది.
కట్ చేస్తే రాధ `ఆఫీసర్ సార్ కంటే నాయనే మంచి వాడని పిల్లలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంటుంది. కానీ పిల్లలు మాత్రం ఆఫీసర్ సారే మంచి వారని, ఆయనని నాయన ఏమీ అనొద్దని చెప్పమంటారు. ఆ మాటలు విని రాధ బాధపడుతుంది. మాధవ .. ఆదిత్యని అవమానించిన విషం దేవుడమ్మకు తెలుస్తుంది. విషయం తెలిసిన వెంటనే తన బిడ్డని మాధవ అంత మాటంటాడా కడిగేస్తా .. దులిపేస్తా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది దేవుడమ్మ.
అయితే తనని అడగాల్సింది మీరు కాదు.. నేను అని సత్య కోపంగా రాధ ఇంటికి వెళ్లి తలుపు తడుతుంది. తలుపు తీసిన రాధకు ఎదురుగా సత్య కనిపించడంతో ఊహించని షాక్‌కు గురవుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? .. సత్య .. తన అక్క రాధని చూసిందా?.. సత్యకు కనిపించకుండా రాధ ఎలా తప్పించుకుంది? అన్నది తెలియాలంటే ఈ రోజు `దేవత` ఎపిసోడ్ చూడాల్సిందే.