English | Telugu

విశ్వ విరాట్ కోహ్లీ లా ఉంటాడు...అని ఆయనకు పెద్ద ఫ్యాన్ !

శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పటిలాగే ఈవారం కూడా అలరించింది. "మంగమ్మ గారి కొడుకు" టైటిల్ తో ప్రసారమైన ఈ ఎపిసోడ్ లో విశ్వ ఆయన భార్య శ్రద్దా జోడి లవ్ స్టోరీ ఈ వారం హైలైట్ అని చెప్పొచ్చు. రష్మీ వీళ్ళ ఇద్దరినీ స్టేజి మీదకి పిలిచి మీ ఇద్దరి జర్నీ గురించి విశ్వ మీద ఎంత ప్రేమ ఉందో చెప్పమని అడిగేసరికి శ్రద్దా "ప్రియతమా ప్రియతమా" అనే సాంగ్ పాడి విశ్వ కోసం డేడికేట్ చేస్తుంది.

ఆ పాట విని విశ్వ "మాట్లాడానికి మాటలు రావడం లేదు" అంటూ తన భార్య నుదిటి మీద ముద్దు పెట్టి తన హ్యాపీనెస్ ని ఎక్ష్ప్రెస్స్ చేసాడు. ఇంకో స్పెషల్ సాంగ్ పాడి విశ్వాని ఖుషి చేసేస్తుంది.

వాళ్ళ ప్రేమ చూసి రష్మీ ఎమోషన్ ఐపోయి స్టేజి మీదకు వచ్చి విశ్వాతన బ్రదర్ చనిపోయినప్పుడు తాను ఎలా ఫీల్ అయ్యింది.అలాగే తన ప్రేమలో ఎన్ని కష్టాలు పడింది అన్ని విషయాలు చెప్పింది. ఇక శ్రద్ద తన మనసులో మాటలు చెప్పింది.."నాకు ఆయనెవరో తెలీదు, నేనెవరో తనకు తెలీదు. నేను ఆయన్ని క్రికెట్ లో చూసాను..విరాట్ కోహ్లీలా ఉంటాడు. అందుకే నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ గా మారిపోయాను.

ఆయన సీరియల్స్ కూడా నేను చూడలేదు. కానీ తర్వాత ఆయన నాకు కావాలి అనుకున్నా..ఈరోజు ఆయన నా పక్కన వున్నారు" అని విశ్వా మీద ప్రేమ గురించి చెప్పింది. విశ్వా కూడా "తన అమ్మ తర్వాత అమ్మ లాంటి భార్య దొరకడం ఆ దేవుడు నాకు ఇచ్చిన వరం" అంటూ తన ప్రేమను వ్యక్తం చేసాడు.