English | Telugu

డాన్స్ ఇప్పుడు ఒక ప్రొఫెషనే ...అరిచి చెప్పిన సుధాచంద్రన్

డాన్స్ ఇండియా డాన్స్ షో మిగతా డాన్స్ షోస్ తో పోటాపోటీగా ముందుకు వెళ్తోంది. ఇక ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ చేసిన డాన్స్ పెర్ఫార్మెన్సెస్ చాలా హార్ట్ టచింగ్ గా ఉన్నాయి. ఇక ఈ షోలో చందన-తన్మయ్ జోడీ డాన్స్ ఇరగదీసేసారు. నవరాత్రి సందర్భంగా చేసిన ఈ పెర్ఫార్మెన్స్ లో రాక్షసుడిని సంహరించడానికి అన్నట్టుగా నాట్య మయూరి సుధా చంద్రన్ అమ్మవారి రూపంలో ఎంట్రీ ఇచ్చి అందరినీ మెస్మోరిజ్ చేసేసారు.

ఈమె చేసిన పవర్ ఫుల్ యాక్షన్ కి స్టేజి మొత్తం లేచి నిలబడి చప్పట్లు కొట్టింది. "వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఈ స్టేజి మీద వచ్చిన చందన-తన్మయ్ చేసిన క్లాసికల్ అద్దిరిపోయింది " అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారామె. ఇక వీళ్లిద్దరికీ ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చిన అవార్డ్స్, సర్టిఫికెట్స్ అన్నిటిని చూపించారు. ఇక ఈ జోడి మాట్లాడుతూ "ఇప్పటివరకు గెలుచుకుంది అంతా ఒక ఎత్తు ఇప్పుడు సుధాచంద్రన్ గారితో స్టేజి షేర్ చేసుకోవడం నిజంగా అదృష్టం. జీవితంలో ఇదే ఒక పెద్ద అచీవ్మెంట్ " అని చెప్పారు. "డాన్సింగ్ ఒక ప్రొఫెషనా అని అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు . ఇప్పుడు చెప్తున్నా డాన్సింగ్ ఒక ప్రొఫెషనే..నేను ఒక డాన్సర్ ని ఐనందుకు ఎంతో గర్వపడతాను " అంటూ గట్టిగా అరిచి మరీ చెప్పారు సుధాచంద్రన్.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.